Viral Video : మనుషుల కంటే మూగజీవాలకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో బయట పడిన విషయమే. ఇప్పటికీ ఎప్పటికీ విశ్వాసం విషయంలో మూగ జీవాలను మనిషి ఎన్నటికీ అధిగమించలేడు. అలాంటి ఓ ఘటననే ఇప్పుడు జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తి పట్ల ఓ కొండముచ్చు చూపిన విశ్వాసానికి ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు.

ఆ శవం వద్దే కూర్చుని ఆ కొండముచ్చు చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసును గెలుస్తోంది. తన సొంత వ్యక్తి కోల్పోయిన ఆ కొండముచ్చు ఎంతో ఆవేదన చెందుతూ అక్కడే ఉండిపోయింది. తనను గుండెలకు హత్తుకుంది. ప్రస్తుతం ఆ కొండముచ్చుకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 సంవత్సరాల పీతాంబరం రాజన్ అనే వ్యక్తి.. ఒక కొండ ముచ్చుకు రోజూ తిండి పెట్టే వాడు. అలా ఓ కొండ ముచ్చుకు అతనికి మధ్య కనెక్షన్ బలపడింది.
All lives, #animals #birds #plants have intelligence & emotions. #Monkey mourns death of man who fed every day. By kissing him. Touching.
AdvertisementHappened in #Srilanka. Mattaglabbu. pic.twitter.com/nBLKEW2JUZ
— Straight Talk India (@sttalkindia) October 20, 2022
Advertisement
అక్టోబర్ 17వ తేదీన పీతాంబరం రాజన్.. అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఆయన పార్ధీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. పీతాంబరం పెంచుకున్న కొండముచ్చు ఆయన శవం దగ్గరికి వచ్చింది. ఎప్పుడూ తనకు తిండి పెట్టి ఆప్యాయత చూపిన ఆ వ్యక్తి వద్ద అలాగే కూర్చుని ఉండి పోయింది. తన విశ్వాసాన్ని చూపించింది. ఆ వ్యక్తి పట్ల తనకు ఉన్న ప్రేమను ప్రదర్శించింది.
Read Also : Viral Video : సింహాన్ని గాల్లోకి ఎగిరేస్తూ.. ఓ ఆట ఆడేసుకున్న గేదెలు, మామూలుగా లేదుగా.. వీడియో వైరల్!