Nithya menen: అలా మొదలైంది సినిమా ద్వార టాలివుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిత్యా మీనన్. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో నిత్యా మీనన్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో వరుస సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగులో ఈ అమ్మడు తెలుగులో నటించిన అలా మొదలైంది, గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది.
ఇటీవల ఈ అమ్మడు నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరనస తిరుచిత్రంబలం మూవీలో నటించింది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు ఇటీవల మోడరన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరిస్ లో కూడా నటించింది. అంతే కాకుండా ఓటిటి లో స్ట్రీమ్ అయిన ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ షో కి కూడా జడ్జ్ గా వ్యవహరించింది. ఇలా వరుస షూటింగ్ల తో బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని చెప్పింది.
Nithya menen:
ఇదిలా ఉండగా అమ్మడు తన గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై స్పందిస్తూ ఇండస్ట్రీలో కొంత మంది శత్రువులు నేను ఎవరితోనూ మాట్లాడనని, నాకు పొగరు ఎక్కువని అందువల్ల సెట్ లో కూడా అందరితో పొగరుగా ప్రవర్తిసస్తానని నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారంటూ వెల్లడించింది. అయితే నా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎటువంటి నిజం లేదని, కొందరు కావాలనే నా గురించి చెడుగా చెబుతు నా ఎదుగుదలకు అడ్డు పడుతున్నారని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు నేను ఎంతోమంది తో నటించాను..కానీ వారెవ్వరూ నాతో నటించటం కష్టమని చెప్పలేదు. ఇండస్ట్రీలో ఉన్న కొందరు శత్రువులు పని కట్టుకొని నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది.