...

Anchors Remuneration: బుల్లితెర యాంకర్లు , సీరియల్ నటీమణుల ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchors Remuneration: సినిమా ఇండస్ట్రీ అంటే అధిక ఆదాయం. సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఉన్న హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలతో పాటు బుల్లితెర మీద సందడి చేస్తున్నా నటీనటులు యాంకర్లు కూడా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెరలో సందడి చేస్తున్న సీరియల్ నటి నటులు, యాంకర్లు లక్షల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బుల్లితెర మీద సందడి చేస్తున్న యాంకర్లు ఒక్కో ఈవెంట్ కి ఎంత సంపాదిస్తున్నారో ఒక లుక్కేద్దాం రండి.

బుల్లితెర యాంకర్ అనగానే అందరికి మొదట గుర్తొచ్చే పేరు సుమ కనకాల.బుల్లితెర మీద ప్రసారం అవుతున్న షో లతో పాటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, అవార్డ్ ఫంక్షన్ లు ఇలా ఎక్కడ చూసినా సుమ సందడే కనిపిస్తుంది. ఇలా నిత్యం షూటింగ్ తో సుమ ఒక కాల్షీట్ కోసం 2.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 4 నుండి 5 లక్షల వరకు అందుకుంటోంది.

Anchors Remuneration: 

ఇక అనసూయ కూడా గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు టీవి షోస్ తో పాటు సినిమాలలో కూడ నటిస్తుంది. ఒక్క రోజు కాల్ షీట్ కోసం దాదాపు రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది.

ఇక బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి కూడా బాగనే సంపాదిస్తోంది. ఒకరోజు కాల్ షీట్ కోసం ఈ అమ్మడు దాదాపు రూ. 1.5 లక్షలు అందుకుంటోంది.

ఇక మరొక బుల్లితెర యాంకర్ శ్యామల కూడా ఈవెంట్ లలో సందడి చేస్తోంది. ఒక్క ఈవెంట్ కోసం రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.

మరొక అందాల యాంకర్ మంజూష కూడా ఒక ఈవెంట్ కోసం రూ. 50 వేల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది.

ఇక బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ సీరియల్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన ప్రేమీ విశ్వనాథ్ ఒక రోజుకి రూ. 50 వేలకు వరకు పారితోషికం అందుకుంటోంది.

మరొక ప్రముఖ టీవి నటి అషిక కూడా బాగా సంపాదిస్తోంది. త్రినయని సీరియల్ లో నటిస్తున్న ఈ అమ్మడు ఒక రోజుకి రూ. 12 వేలు అందుకుంటోంది.

హీరోయిన్ గా గుర్తింపు పొందిన సుహాసిని సీరియల్ నటిగా మారి రోజుకి రూ. 25 వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది. ఈమె సీరియల్ నిర్మాతగా కూడ వ్యవహరిస్తోంది.

ఇక మీనాక్షి సీరియల్ ద్వారా బుల్లితెర నటి గా గుర్తింపు పొందిన నవ్య స్వామి ఒక రోజుకి రూ. 20 వేలు అందుకుంటోంది.

ఆడదే ఆధారం సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన పల్లవి రామిశెట్టీ కూడా రూ. 15 వరకు రెమ్యునరేషన్ అందుకుంటోంది.