Alia bhatt baby bump: అలియా భట్ ఎంతో ట్యాలెంట్ ఉన్న నటి. తన అందచందాలతో పాటు తన ప్రతిభతో ఎంతో మందిని అభిమానులు తయారు చేసుకుది అలియా భట్. సినీ కుటుంబ నేపథ్యంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన శైలి నటనతో అలరిస్తోంది అలియా భట్. బాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది మోస్ట్ ట్యాలెంట్ నటీమణుల్లో ముందు వరుసలో ఉంటుంది అలియా.
జక్కన్న, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తన ఫల్ట్ డైరెక్ట్ టాలీవుడ్ సినిమా కావడం గమనార్హం. అందులో సీతా క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించింది అలియా. కనిపించింది కాసేపే అయినా కీలక పాత్ర చేసి అలరించింది ఈ బ్యూటీ. ఈ ఏడాది ఏప్రిల్ 14న రణ్ బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ గా పేరు వచ్చింది ఈ కపుల్ కు.
https://youtu.be/fpbWheFb4oo
అలియా భర్త రణ్ బీర్ కపూర్.. నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం పలు భాగాలుగా తెరకెక్కుతోంది. అయితే మొదటి భాగం పేరు శివ అని పెట్టారు చిత్ర దర్శకనిర్మాతలు. ఈ బ్రహ్మాస్త్ర- శివ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు రణ్ బీర్ కపూర్. ఈ సినిమా ప్రచారానికి వచ్చింది అలియా భట్. ఆరు నెలల గర్భంతో ఉన్న బేబీ బంప్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.