Niharika konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు అన్నా హీరోయిన్ మాత్రం నిహారిక ఒక్కరే. ఆమె ఎక్కడ ఉన్నా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఎప్పుడూ ఫన్నీ సెటైర్లు వేస్తూ… బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ అనుకోని వివాదాల్లో చిక్కుకొని తెగ ఇబ్బంది పడిపోతుంటుంది.
అయితే మొన్నామధ్య నిహారిక ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ రైడ్ లో నిహారిక పేరు కూడా వినిపించింది అయితే నిహారిక ఆ పబ్ కు కేవలం పార్టీ కోసమే వెల్లిందని ఆమె తండ్రి చెప్పి సపోర్ట్ చేశారు. అది నిజమేనంటూ పోలీసులు కూడా ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిహారికకి తన భర్త చైతన్యతో గ్యాప్ వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలని ఒక్క పోస్ట్ తో చెప్పేసింది నిహారిక.
తన భర్త చైతన్యతో క్లోజ్ గా ఉన్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా నిహారిక, చైతన్య ఇద్దరూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను ఈమె అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారిదం. నిహారిక, చైతన్య కలిసి జంటగా తీస్కున్న ఫొటోలు చూసి అబిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు.