Viral Video: పిచ్చి పలు రకాలు అని పెద్దలు చెబితే ఏమో అనుకుంటాం కానీ అది నిజమేనండోయ్… ఈ మధ్య చాలా మంది ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, అండర్ వాటర్, అండర్ ఎయిర్ అంటూ పలు రకాల స్టైల్స్ లో పెళ్లిళ్లు చేస్కుంటూ, ఫొటోలు దిగుతున్నారు. అయితే ఓ జంట ఇందుకు భిన్నంగా అందరన్నీ ఆకర్షించాలనే ఉద్దేశంతో… రిసిప్షన్ కు వచ్చిన అతిథులందరినీ షాక్ కి గురి చేశారు. అయితే ఆ నవ దంపులు చేసిన వింత ఏఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గేబ్-అంబిర్ అనే ఆ కొత్త జంట ప్రొఫెషనల్ స్టంట్ మాస్టర్స్. అయితే వీరిద్దరి పెళ్లి రిసెప్షన్ లో అతిథులందరికీ గుర్తిండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నారు. అందుకే వారిద్దరూ చెరో జాకెట్ వేసుకొని దాని నుంచి నిప్పు వచ్చేలా చేశారు. స్టంట్ ప్రారంభించే ముందు ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఒకచోట నిలబడ్డారు. ఇంతలో ఓ వ్యక్తి అంబిర్ కుడి చేతిలో పట్టుకున్న ఫ్లవర్ బొకేకి నిప్పంటించాడు. క్షణాల్లో ఆ మంటలు వధూవరుల వీపు భాగంలోకి వ్యాపించాయి. అలానే రెండడుగులు ముందుకు నడిచిన జంట… ఆ తర్వాత చిన్నగా పరిగెత్తారు.
అందరూ అగ్ని ప్రమాదం ఏదో జరిగింది అనుకుంటడగా… దంపతులు మోకాళ్లపై కూలబడ్డారు. వెనకాలే పరిగెత్తుకొచ్చిన ఓ వ్యక్తి వెంటనే మంటలార్పేశాడు. ఈ కొత్త జంట చేసిన ఫైర్ స్టంట్కి వెడ్డింగ్ రిసెప్షన్కి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. గేబ్, అంబిర్ ప్రస్తుతం హాలీవుడ్లో స్టంట్ మాస్టర్స్ పనిచేస్తున్నారు. అందుకే ఇంత అలవోకగా… ఎటువంటి బెరుకు లేకుండా ఆ స్టంట్ కానిచ్చేశారు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ రస్ పావెల్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… తెగ వైర్ అవుతోంది.
https://youtu.be/A6ji3znFwvk