...

Viral Video: ఇలాంటి కూలర్ ఎక్కడా చూసిండరు.. ఇండియన్స్ టాలెంటే టాలెంటు!

Viral Video: వేసవి కాలంలో వచ్చే వేడిని భరించలేక చాలా మంది ఫ్యాన్సు, కూలర్లు, ఏసీలను వాడుతుంటారు. అవేవీ కొనే స్థితిలో లేని వారు ఏ చెట్టు కిందో పందిరి కిందో కూర్చొని… సూర్యుడి వేడి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే ఏదైనా ఫంక్షన్ వంటివి జరిగితే… టెంటు కింద చేసే వాళ్లు ఎండా కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అక్కడక్కడా టేబుల్ ఫ్యాన్స్ పెట్టినా అంతగా ఫలితం ఉండదు. అందుకే ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి ఓ దేశీ ఎయిర్ కూలర్ ను పెట్టాడు. ఫంక్షన్ జరుగుతున్న చోటు ఉన్న వాళ్లందరికీ చల్ల దనాన్ని పంచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

ఫంక్షన్ జరిగే చోట ఉన్న టెంట్ ముందు థ్రెషర్ మెషినన్ను అమర్చాడు. ఇక దాని నుంచి వచ్చే చల్లటి గాలిని టెంట్లో ఉన్నవాళ్లంతా ఆస్వాదించేలా సెట్ చేశాడు. కాగా, ఈ దేశీ జుగాడ్ను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ‘థ్రెషర్ గాలి’తో జనాలకు స్వాగతం’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్షా 80 వేలకు పైగా వ్యూస్ రాగా.. దీనిని 10 వేలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే నెటిజన్లు కూడా వరుసపెట్టి కామెంట్స్ హోరెత్తిస్తున్నారు.