...

Viral video: డీజే పాటలకు అదరగొట్టిన వధూవరులు..!

Viral video: ఒకప్పుడు పెళ్లి జిరిగితే బంధువులు మిత్రులు డ్యాన్సులు చేసే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లే చిందేస్తున్నారు. సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ తో కుమ్మేస్తున్నారు. అటు బరాత్ తో పాటు పెళ్లి పీటల వేదికపైనా నృత్యాలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు కామన్ ట్రెండ్ అయిపోయింది. ఆ మధ్య బరాత్ లో బుల్లెట్టు బండి ఎక్కి వచ్చేత్తపా అనే సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం ట్రెండ్ నడిచింది. తెలంగాణలో ఒక అమ్మాయి చేసిన వీడియో తెగ వైరస్ కావడంతో అప్పటి నుండి ప్రతి పెళ్లి బరాత్ లో బుల్లెట్టు బండి పక్కా ఉంటూనే ఉంది. బుల్లెట్టు బండి పాట పెట్టుకోవడం వధూవరులు డ్యాన్స్ చేయడం ప్రతి చోటా కనిపించింది.

ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త పెళ్లి పీటలకెక్కింది. పెళ్లి వేదిక మీదే డ్యాన్సులు చేస్తున్నారు వధూవరులు. ఈ మధ్య కాలంలో హిట్టు అయిన ఒకటీ రెండూ పాటలను తీసుకోవడం వాటి లిరిక్స్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేయడం నడుస్తోంది. తాజాగా తెలంగాణలో జరిగిన ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్స్ ఇరగదీశారు. డీజే టిల్లు టైటిల్ సాంగ్ వేసుకొని స్టెప్పులేశారు. ఈ డ్యాన్సులో పెళ్లి కొడుకు కాస్త నెమ్మదిగా కనిపించగా.. పెళ్లి కూతురు మాత్రం ఇరగదీసింది. మాంచి ఊపుతో డ్యాన్స్ చేసింది. ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డీజే టిల్లు డ్యాన్సుతో పెళ్లికి వచ్చిన వారిని కట్టిపడేసింది.