...

Nayanathara vignesh wedding : నయన్-విఘ్నేష్‌ల పెళ్లి ఆహ్వానం.. వెడ్డింగ్ కార్డు వీడియో వైరల్..!

Nayanathara vignesh wedding: నయన తార పెళ్లి పనులతో ఫుల్ బిజీగా ఉంది. కాబోయే భరత్ విఘ్నేష్ శివన్ తో కలిసి ఆమె స్వయంగా పెళ్లి పనులు చూసుకుంటుంది. పెళ్లి షాపింగ్ దగ్గర నుంచి ఆహ్వాన పత్రికలు పంపడం వరకు నయన తారనే చూసుకుంటుంది. జూన్ 9వ తేదీన విఘ్నేష్ శివన్.. నయన తార పెళ్లాడనున్నారు. బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి రానున్నారు. ఇప్పటికే కొందరు అతిథులకు డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డుని పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ పత్రిక ప్రకారం నయన్-విఘ్నేష్ తమిళనాడులోని మహాబలి పురంలో పెళ్లాడనున్నారు. ఈ వెడ్డింగ్ వీడియో డిజైన్ చాలా బాగుంది అంట. ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో ఈ వీడియోని డిజైన్ చేశారు. మొత్తానికి నయన తార పెళ్లికి సమయం దగ్గర పడింది అన్నమాట. గత వారం నయన తార జంట తంజావూరులోని పాపనాశంలో మేల్ మరమతు గ్రామంలో అమ్మవారి ఆలయాన్ని సందర్శించింది. ప్రత్యేక పూజలు కకూడా చేశారు. అయితే తన పెళ్లి విషయంపై ఈ జంట ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also : Nayanathara : పెళ్లి ముహూర్తం కుదిరింది.. తిరుపతిలో ఘనంగా పెళ్లి చేసుకోనున్న నయనతార!