Intinti Gruhalakshmi July 4 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య భాగ్య ఇద్దరూ రంజిత్ ఉన్న ప్రదేశానికి వెళుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో తులసి వాళ్లు లాస్య భాగ్యను ఫాలో అవుతూ వెళ్తారు. లాస్య,భాగ్య ఎట్టకేలకు తులసి చెప్పిన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఆ ప్రదేశాన్ని చూసి భయంతో లోపలికి వెళ్తారు. లోపల వాతావరణం చూసి ఇద్దరు భయపడిపోతూ ఉంటారు.

ఇక మధ్య మధ్యలో భాగ్య తన మాటలతో లాస్యను మరింత భయపడుతుంది. వారిద్దరినీ తులసి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇక లాస్య రంజిత్ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో దివ్య నక్క అరిచినట్టుగా వింతగా శబ్దం చేయడంతో వారిద్దరు భయంతో వణికి పోతూ ఉంటారు. అప్పుడు భాగ్యా భయంతో ఇక్కడ దెయ్యం ఉంది లాస్య అని భయపెడుతాడంతో లాస్య కూడా భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వారిని మరింత భయపెట్టాలి అని తులసి, దివ్య, అంకిత వాళ్ళు మరింత గట్టిగా వింత వింతగా శబ్దాలు చేస్తూ ఉంటారు.
అప్పుడు వారిద్దరూ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా ఇంతలోనే తులసి వాళ్ళు చీకటిలో నుంచి ఎంట్రీ ఇస్తుండడంతో భాగ్య అది చూసి దయ్యాలు అనే బిత్తర పోతుంది. కానీ లాస్య వారిని బాగా గమనించి దెయ్యాలు కావు అనడంతో భాగ్య చూడా కాస్త బాగా గమనించి తులసి వాళ్ళు రావడంతో యాక్టింగ్ చేస్తూ బాగున్నావా తులసి అక్క అని అడుగుతుంది.
కానీ లాస్ ఏ మాత్రం టెన్షన్ తో భయపడుతూ ఉంటుంది. అప్పుడు తులసి అసలు విషయం చెప్పడంతో లాస్య కి మైండ్ బ్లాక్ అవుతుంది. నా 20 లక్షలు డబ్బులు ఇవ్వకపోతే నేను నేరుగా నందు దగ్గరికి వెళ్లి అసలు నిజం చెబుతాను. 24 గంటల్లో నా 20 లక్షల డబ్బులు నా అకౌంట్ లో ఉండాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తులసి.
మరొకవైపు ప్రేమ్ బాధతో ఇంటికి రావడంతో శృతి ఆనందంగా కనిపిస్తుంది. అప్పుడు శృతి పాంప్లెంట్ ను ప్రేమ్ కు చూపించగా ప్రేమతో దానిపై ఆసక్తి చూపించడు. పైగా కాంపిటీషన్ కు వెళ్ళను అంటూ శృతి తో వాదిస్తూ ఉంటాడు. మరొకవైపు నందు లాస్య కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో లాస్య రావడంతో అప్పుడు నందు సరే పద బయటికి వెళ్దాం అని అనడంతో నాకు చిరాకుగా ఉంది అని చెప్పి అసలు విషయం చెబుతుంది.
దాంతో నందు ఒక్కసారిగా షాక్ అవుతాడు. రేపటి ఎపిసోడ్లో తులసి లాస్య కు ఫోన్ చేసి డబ్బులు పడ్డాయి అని చెప్పడంతో లాస్య నేను వేయలేదు కదా అనుకుంటూ ఉండగా ఇంతలో నందు వచ్చి నేనే వేశాను అని చెప్పి లాస్య పై ఒక రేంజ్ లో విరుచుకుపడతాడు. నువ్వు ఒక చీటర్ వి ఇంకా ఎప్పుడు నా మొఖం చూపించవద్దు. నీ దారి నీది నా దారి నాది. నీతో కలిసి కాపురం చేయను అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు.
Read Also : Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..?