Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఇలా ఎన్నో సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా నాగచైతన్య, రాశిఖన్నా జంటగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నటించిన థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య రాశి ఖన్నా వారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
Naga Chaitanya
ఈ క్రమంలోనే నాగచైతన్య మాట్లాడుతూ తాను రాసి ఖన్నాతో కలిసి రెండు సినిమాలలో నటించానని, ఈ సినిమాలతో మా ఇద్దరి మధ్య ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడిందని చైతన్య వెల్లడించారు.షూటింగ్ సమయంలో విరామం దొరికితే ఇద్దరం కలిసి ముచ్చట్లు పెడతామని ఇలా ఒకరి ఇష్టాలు గురించి మరొకరు తెలుసుకోవడమే కాకుండా ప్రతి విషయం గురించి ఇద్దరం షేర్ చేసుకుంటామని చైతన్య పేర్కొన్నారు. తన గురించి నాకు నా గురించి తనకు అన్ని విషయాలు తెలుసని చైతన్య పేర్కొన్నారు.
Naga Chaitanya : నాగచైతన్య గురించి రాశి ఖన్నాకామెంట్స్ వైరల్….
ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాశిఖన్నా మాట్లాడుతూ చైతూ గురించి ఒక రహస్యం బయటపెట్టారు. చైతన్యకు కార్లు అంటే ఎంతో ఇష్టమైన ఆయన వద్ద ఎంతో ఖరీదైన కార్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇకపోతే ఎవరికి తెలియని విషయం ఏమిటంటే చైతన్యకి సైట్ కూడా ఉందని రాశి ఖన్నా బయటపెట్టారు. తను ఇన్ని రోజులు సైట్ తో బాధపడుతూనే స్పెట్స్ పెట్టుకున్నారని అది స్టైల్ కోసం కాదని రాశిఖన్నా ఇంటర్వ్యూ సందర్భంగా నాగచైతన్య బాధపడుతున్న సమస్య గురించి వెల్లడించారు. ప్రస్తుతం రాశి ఖన్నా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నారు అవుతున్నాయి.
Read Also : Naga Chaitanya : చైతన్య ఇంకా సమంతను మర్చిపోలేకపోతున్నారా… తన గుర్తుగా వాటిని అందుకే ఉంచుకున్నారా?