Upasana -Ram Charan : మెగా వారసుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తాను ప్రేమించిన అమ్మాయి ఉపాసనను పెద్దలను ఒప్పించి ఎంతో అంగరంగ వైభవంగా 2012 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి కావడంతో వీరి పదవ వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీలో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.ఈ విధంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ వీరికి పిల్లలు లేరు అనే లోటు మాత్రం అభిమానులలో ఉంది.
ఎప్పుడెప్పుడు మెగా వారసుడి గురించి వీరు గుడ్ న్యూస్ చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో భాగంగా సద్గురుని కలిసిన ఉపాసన నేను నా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ చాలామంది నన్ను పిల్లల గురించి ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడానికి కారణం ఏంటి అంటూ సద్గురుని అడిగారు.ఈమె అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానం చెబుతూ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు అవసరం లేదని,రోజురోజుకు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పాపులేషన్ కంట్రోల్ చేయడానికి ఉపాసన పిల్లలను వద్దనుకుంటున్నారు అంటూ సద్గురు ద్వారా వెల్లడించారు.
Upasana -Ram Charan : రామ్ చరణ్ ఉపాసన పిల్లలపై క్లారిటీ ..
అయితే పిల్లల గురించి రాంచరణ్ ఉపాసన మాట్లాడుతూ మెగాస్టార్ వారసుడిగా, ఆయన అభిమానులను సంతోషపెట్టే బాధ్యత నాపై ఉంది. నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి నేను పిల్లలు, ఫ్యామిలీపై ఫోకస్ పెడితే నా లక్ష్యం నెరవేరదు. అదేవిధంగా ఉపాసనకు కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అవి తీరేవరకు పిల్లలు వద్దనుకున్నామని ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పష్టం చేశారు.అయితే సద్గురు పిల్లలు వద్దనుకున్న వారికి బహుమానం ఇస్తానని చెప్పగా ఆ బహుమానాన్ని స్వీకరించడానికి తన కుటుంబం సిద్ధంగా లేదని ఉపాసన చెప్పడంతో కాస్త ఆలస్యమైన వీరిద్దరూ పిల్లలు కావాలనే ఆలోచనలోనే ఉన్నట్లు అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేశారు.
Read Also : Upasana konidela: మెగా వారసుడు వచ్చేస్తున్నాడు..! చెప్పకనే చెప్పేసిన ఉపాసన!