New Traffic Rules: మోటార్ వాహన చట్టంలో కొత్తగా మార్పులు వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై వాహనదారులు మారిన కొన్ని రూల్స్ తెలుసుకుని వాటిని తప్పక పాటించాల్సి ఉంటుంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. నాకేం కాదులే అనుకొని రోడ్లపైకి వస్తే భారీగా ఫైన్లు చెల్లించుకోక తప్పదు. ఏఏ విషయాలు గమనించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం.. వాహనానికి సంబంధించిన అన్ని డాక్యమెంట్లు, హెల్మెట్ ధరించినప్పటికీ ఫైన్ చెల్లించాల్సి రావచ్చు. ఇలా ఎందుకంటే.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో వారితో తప్పుగా ప్రవర్తిస్తే.. రెండు వేల రూపాయల జరిమానా విధించబడుతుంది.
మోటారు వాహన చట్టంలోని రూల్ – 179 వాహనదారులపై చర్యలు ఉంటాయని ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇతర పత్రాలను అఢిగినప్పుడు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించినందున ఈ రూల్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే.. ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సమస్యను కోర్టుకు తీసుకెళ్లేందుకు చట్టం అనుమతి ఇస్తుంది.