Viral video: బిడ్డ జోలికి వస్తే తల్లి ఊరుకుంటుందా.. తొక్కి పట్టి నార తీస్తుంది!

Viral video: తల్లి ప్రేమ ముందు మరేది సాటి రాదు. దానికి వెలకట్టలేం. అది మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ తల్లి ప్రేమే. పిల్లలకు ఏదైనా జరిగితే ఏమాత్రం సహించరు. పిల్లలకు అపాయం వస్తుందని అనుకుంటే దేనికైనా సిద్ధపడిపోతారు. ఎలాంటి ప్రమాదాన్ని అయినా ఎదుర్కొంటారు. ఇక్కడ ఉన్న ఈ వీడియోలో ఓ ఏనుగు తన గున్న ఏనుగు పట్ల తన తల్లి ప్రేమను కనబరుస్తోంది. అసలేం జరిగిందంటే..?

Advertisement

ఏనుగులు సోషియో జంతువులు. అంటే అవి మనుషుల్లాగే గుంపులు గుంపులుగా జీవిస్తాయి. పులుల్లాగా ఒంటరిగా ఉండవు. వాటికి కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు, బంధువులు ఉంటారు. అయితే ఏనుగులు అచ్చం మనుషుల్లాగే ప్రేమను చూపిస్తాయి. ఇక్కడ ఓ చిన్న కుంట ఉంది. ఆ కుంటలో నీళ్లు తాగేందుకు ఓ గున్న ఏనుగు వస్తుంది. అది పిల్ల ఏనుగు దానికి ఎటు నుండి ప్రమాదం పొంచి ఉంటుందో అవగాహన ఉండదు. కాబట్టి కుంట వద్దకు వెళ్లి నీళ్లు తాగుతుండగా ప్రమాదం వచ్చి పడింది. కుంటలో నీళ్లు తాగుతుండగా దానిని ఓ మొసలి పట్టుకుంది. గున్న ఏనుగును మొసలి పట్టుకోగానే.. తల్లి ఏనుగుకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ పెద్ద ఏనుగు తన పిల్ల ఏనుగును పట్టుకున్న మొసలిపైకి దాడికి దిగింది. తన కోపాన్నంతా మొసలిపై చూపించింది. తల్లి ఏనుగు దాడికి తట్టుకోలేక ఆ మొసలి గున్న ఏనుగును విడిచిపెట్టి పారిపోయింది.

Advertisement