...

Ghani Trailer : గని ట్రైలర్ కిరాక్.. అదిరే డైలాగ్.. ఈ సోసైటీ.. గెలిచినవాడి మాటే నమ్ముతుంది..!

Ghani Trailer : మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త మూవీ గని (Ghani Movie) నుంచి కొత్త ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వరుణ్ తేజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తోంది. గని మూవీ బాక్సింగ్ నేపథ్యంలో రాబోతోంది. ఇందులో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు.

అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీకి భారీ స్పందన వస్తోంది. సిద్ధు, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గని మూవీ నుంచి వచ్చిన టీజర్లు, పాటలు, పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ తేజ్ కొత్త మూవీ గని ఏప్రిల్ 8, 2022 థియేటర్లలో సందడి చేయనుంది. లేటెస్టుగా గని ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ కొత్త గని ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సొసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది.. వరుణ్ చెప్పే డైలాగ్ అదిరిపోయేలా ఉన్నాయి. డాడ్ గెలవాలి.. ఆట గెలవాలంటే నేను గెలవాలి అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ లు సూపర్ గా వచ్చాయి. గని మూవీలో వరుణ్ తల్లిగా నదియా నటించారు.

జగపతి బాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక రోల్స్ నటించారు. గని మూవీలో సిక్స్ ప్యాక్ లుక్ లో వరుణ్ కిరాక్ పుట్టించాడు. గని ట్రైలర్ చూస్తుంటే.. వరుణ్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉంది. మూవీపై కూడా భారీ అంచనాలు పెరుగుతున్నాయి. గని ట్రైలర్ ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి..

Read Also : Anchor Suma: సుమక్కకే చుక్కలు చూపించిన బుల్లితెర జంటలు…వీళ్ళు మామూలోల్లు కాదు!