September 21, 2024

Anchor Suma: సుమక్కకే చుక్కలు చూపించిన బుల్లితెర జంటలు…వీళ్ళు మామూలోల్లు కాదు!

1 min read
pjimage 2022 03 17T170354.045

Anchor Suma:సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఇలా బుల్లి తెరపై విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుని గత కొన్ని సంవత్సరాల నుంచి దూసుకుపోతున్న క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శనివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఈ వారం బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది.

pjimage 2022 03 17T170354.045ఎప్పటిలాగే సుమ తనదైనశైలిలో వారిపై పంచులు వేయడం తిరిగి వారు కూడా రివర్స్ పంచ్ వేస్తూ సుమకి చుక్కలు చూపించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ వేసిన ప్రశ్నలకు మీరు చెప్పిన సమాధానాలు విన్న సుమ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే సుమ ప్రశ్నలు అడుగుతూ.. సుమ నటించిన మొట్టమొదటి సీరియల్ ఏంటి అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు సమాధానంగా కంటెస్టెంట్ అన్షు కౌంటర్ వేస్తూ మా జనరేషన్ కి సరిపోయే ప్రశ్నలు అడగండి అంటూ సమాధానం చెప్పారు.

ఈ విధంగా సుమ అడిగిన ప్రశ్నకు సుమకే కౌంటర్ వేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. అంతేకాకుండా ఈ ప్రోమోలో కంటెస్టెంట్ ల చేత డైరెక్షన్ చేయించడం అలాగే రిలే నిరాహార దీక్షలు చేయించడం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులను బాగా సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సుమ ఒకవైపు బుల్లితెరపై బిజీగా ఉండటమే కాకుండా వెండితెరపై కూడా నటించడానికి సిద్ధమైంది. త్వరలోనే సుమ నటించిన జయమ్మ పంచాయతీ విడుదల కానుంది.