Viral video : మేకపోతుతో తలపడిన యువకుడు.. చివరికి ఏం జరిగిందో తెలుసా..?

Viral video : ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి వ్యాయామాలు చేయటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి జిమ్ కి వెళ్లలేని వారు వారికి అందుబాటులో ఉన్న పరికరాలతో వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ ని పెంచుతున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల ఇళ్లకే పరిమితమైన చాలామంది యువకులు ఇంట్లో అందుబాటులో ఉన్న పరికరాలతో వ్యాయామాలు చేయడానికి బాగా అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఒక ఆఫ్రికన్ కూడా త‌న ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు వినూత్న ప్రయత్నం చేశాడు.

Advertisement

ఈ క్రమంలో అతను తన శక్తినంత ఉపయోగించి హోరాహోరీగా ఒక మేకపోతుతో ఢీ కొట్టి పోటీ పడ్డాడు. పోటీపడ్డాడు. ఓ మేకపోతుతో ఢీ కొడుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ట్విట‌ర్‌ లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక పెద్ద బండ‌పైన బలిష్టమైన ఓ మేకపోతు నిల్చుని ఉంది. కింద వ్యక్తి నిల్చుని బండరాయి ని సపోర్ట్ చేసుకొని మెకపోతుతో పోటీ పడ్డాడు.యువకుడు, మేకపోతు ఒకరి నొకరు తలతో బలంగా కుస్తీ పడుతున్నారు. సదరు యువకుడు తనలో ఉన్న శక్తినంతా ఉపయోగించి మేక కు గట్టి పోటీ ఇస్తున్నాడు.

 

Advertisement

ఇక మేకపోతు కూడా వెనుకడుగు వేయకుండా చాలా బలంగా ఈ యువకుడితో పోటీ పడింది . దాదాపు 20 సెక‌న్లు హోరాహోరిగా త‌ల‌ప‌డిన త‌ర్వాత మేక తన బలంతో ఆ యువకుడిని పక్కకు నెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మేక స్టామినా చూసి షాక్ అవుతున్నారు. ఆ యువకుడు బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిలా మేకను ఒడించటానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ చివరికి మేకపోతు చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియోను లక్షలమంది చూస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఆ యువకుడిని రియల్ భల్లాలదేవ అని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement