Diesel pond: పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. ఆ గ్రామాన్ని అదృష్టం వరించింది. గ్రామ పరిసరాల్లో డీజిల్ తో కూడిన గుంత ఏర్పడింది. దీంతో ఆ గ్రామస్థులంతా అక్డకు వచ్చి ఫ్రీగా లీటర్లు లీటర్ల డీజిల్ ను తోడుకుంటున్నారు. అయితే ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఉండడంతో ఇది నిజమేనని భావిస్తున్నారు చాలా మంది. ఈ వీడియో, ఫొటోలు చూసిన నెటిజెన్లు అందరూ ఆ ఊరి వాసులపై అసూయ పడుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ ఊరేంటి, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఛత్తీస్ గడ్ లోని దంతెవాడ జిల్లాలో ఉన్న గీడం పోలీస్ స్టేషన్ పరిధి గ్రామ ప్రజలు… గుంతలోంచి లీటర్ల కొద్దీ డీజిల్ ను ఫ్రీగా తోడేస్కుంటున్నారు. అయితే ఈ డీజిల్ పాండ్ వెనకాల ఓ పెద్ద కథే ఉందియ అదేంటంటే.. రాయ్ పూర్ నుంచి బచేలి వెళ్లున్న ఓ డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే ట్యాంక్ లోని డీజిల్ అంతా నేలపాలైంది. అదికాస్తా దగ్గర్లోని నీటి గుంతలోకి చేరి.. అక్కడ డీజిల్ తో కూడిన గుంత తయారైంది. దీన్ని గమనించిన గ్రామస్థులు డీజిల్ మొత్తాన్ని పట్టుకెళ్లిపోయారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు మాత్రం నెట్టింట వైరల్ గామారాయి. అయితే ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ తో పాటు క్లీనర్, బైకర్ స్వల్పంగా గాయపడ్డారు.