Telugu NewsLatestMalli Nindu Jabili Serial Aug 3 Today Episode : శోభనం గదిలోకి మల్లి.....

Malli Nindu Jabili Serial Aug 3 Today Episode : శోభనం గదిలోకి మల్లి.. అరవింద్‌ చేసిన పనికి మల్లి ఆగ్రహం.. ఆ తర్వాత ఏమైందంటే?

Malli Nindu Jabili Serial Aug 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సత్య ని బయటికి వెళ్లకుండా మల్లి ఆపుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. సత్య వెళుతుంటే మల్లి తన చేతిని అడ్డుపెట్టి వెళ్లకుండా ఆపుతుంది. నువ్వు వెళ్ళద్దు బాపు నీ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు అంటుంది. అప్పుడు సత్య మనవాళ్లు చస్తుంటే నన్ను ఇక్కడే ఉండమంటావా నేను కచ్చితంగా వెళ్లి తీరాలి అంటాడు. అప్పుడు మల్లి గీతను గీసి లక్ష్మణుడు గీసిన గీతను సీత దాటింది అందుకే రావణుడు ఎత్తుకెళ్లాడు ఇప్పుడు నేను గీసిన గీతను దాటితే నీకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు.

Advertisement
Malli's friends make arrangements for Malli and Aravind's nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals
Malli’s friends make arrangements for Malli and Aravind’s nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals

అందుకే నా మాట విని నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు నీకు ఏదో జరగబోతుందని నా మనసు కీడు శంకిస్తోంది అంటుంది. అప్పుడు సత్య అరవింద్ ని భార్యని తీసుకెళ్ళు అంటాడు. అప్పుడు అరవింద్ నువ్వు రా మల్లి సత్య కి ఏమి జరగదు అని చెప్తాడు.ఇక సుమిత్ర తన రూం లో కూర్చుని తన పిల్లల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇక వాళ్ళ ఆయన అక్కడికి వస్తాడు. ఏమైంది సుమిత్ర ఎందుకు బాధ పడుతున్నావ్ అంటాడు. అప్పుడు సుమిత్ర పేరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ ఇద్దరు ఇంట్లో ఉండరు పెద్ద కూతురి జీవితం ఏమో అన్యాయం అయిపోయింది. లక్కీ తో ఎంత మాట్లాడాలని చూసినా మాట్లాడట్లేదు లక్కీ విషయంలో మనం ఏమన్నా తప్పు చేశామా అని అంటుంది. అప్పుడు అతను నేను టీచర్ ని పిల్లల గురించి నాకు బాగా తెలుసు మనం లక్కీ విషయంలో ఎటువంటి తప్పు చేయలేదు అంటాడు.

Advertisement
Malli's friends make arrangements for Malli and Aravind's nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals
Malli’s friends make arrangements for Malli and Aravind’s nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals

నాకు ముగ్గురు పిల్లలు ఇచ్చిన దేవుడు అసలు పిల్లలని ఇవ్వకుండా ఉన్న బాగుండేది. మనకి బాధలు ఉండేవి కాదు అంటుంది. అప్పుడు అనుపమ అక్కడికి వచ్చి ఏంటి అక్క అలా అంటున్నావ్ మనం ఇలా సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం మన పిల్లలే రూప, ధ్రువ, లక్కీ తో పాటు అరవింద్ నీ కూడా నీ సొంత బిడ్డలా చూసుకున్నావు. నీ పెంపకంలో ఎటువంటి తప్పు లేదు అక్క అయినా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా నువ్వు చూస్తూ ఉండు త్వరలోనే రూప జీవితం చక్కబడుతుంది. ఇంకా ధ్రువ మరియు లక్కీ లు కూడా మన దగ్గరికి వస్తారు అంటుంది. అప్పుడు సుమిత్ర అదే ఆశతో బ్రతుకుతున్న అనుపమ అంటుంది.

Advertisement
Malli's friends make arrangements for Malli and Aravind's nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals
Malli’s friends make arrangements for Malli and Aravind’s nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals

అరవింద్ సత్య పై దాడి చేయాలని చూస్తున్నారు అంటే ఇకపై ప్రభుత్వం శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా లేదనుకుంటా ఇక నేను ఇక్కడ ఉండటం అనవసరం పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటాడు. ఇక అరవింద్ మరియు మల్లి కి ఒక వైపు శోభనం జరిపించడానికి అన్నీ సిద్ధం చేస్తారు. మల్లి చేతికి పాల గ్లాస్ ని ఇచ్చి బావగారు నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్తారు. అప్పుడు మల్లి బాబు గారు నా మీద ఏమైనా అరుస్తారేమో అంటూ భయపడుతుంది. మల్లి రూమ్ లోకి రాగానే రా మల్లి ఏంటి అలానే ఉండిపోయావు అంటాడు. అప్పుడు అరవింద్ నిజం చెప్తే మా వాళ్ళనీ ఏమైనా చేస్తారు అని బెదిరిస్తున్నావు అవసరమైతే వాళ్లని ఇక్కడ లేకుండా చేస్తా నా ఫ్రెండ్స్ తో దూరంగా ఉంటా నా జాబ్ కూడా మానేస్తా అంటాడు. బాబు గారు వీళ్ల గురించి మీకు తెలియదు అంటుంది.

Advertisement
Malli's friends make arrangements for Malli and Aravind's nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals
Malli’s friends make arrangements for Malli and Aravind’s nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals

అప్పుడు అరవింద్ మా వాళ్ళ పైన ఈగ వాలకుండా చూసుకుంటాను నీ నుండి దూరం అవ్వడానికి నేను ఎక్కడికి అయినా వెళతాను. అంతేకానీ నిన్ను మాత్రం నా దగ్గరికి చేరనీవ్వను మీ వాళ్లు కానీ సత్య కానీ నన్నేం చేయకుండా నేను చూసుకోగలను అంటాడు.న పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిగిందని నీకు తెలుసు అయినా బలవంతపు పెళ్లిళ్లు చట్టం కూడా ఒప్పుకోదు మీ అమ్మకు ఒంట్లో బాలేదని ఇన్ని రోజులు ఓపిక పట్టాను మీ వాళ్లు ఏం చేసినా దానికి అంగీకరించాను. ఇంక గంగిరెద్దులా తల ఊపడం నావల్ల కాదు మీ వాళ్ళు ఏం ఆచారాలు చేసిన ఈ ఒక్కరోజు మాత్రమే గుర్తుపెట్టుకో అంటాడు. అప్పుడు మల్లి నేను చెప్పేది వినండి బాబు గారు ఆ సీతారాముల మీద ఒట్టేసి చెబుతున్నాను నాకు నిజంగా ఏమీ తెలియదు అంటుంది.

Advertisement
Malli's friends make arrangements for Malli and Aravind's nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals
Malli’s friends make arrangements for Malli and Aravind’s nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals

అప్పుడు అరవింద్ మన పెళ్లి అబద్ధం ఆ పెద్ద ఆవిడ దీవెనలు కూడా అబద్ధమే వర్షం లో ఒక రోజు నీతో ఉన్నందుకే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు కూడా నీతో ఇలా ఉన్నాను అంటే నేను తరువాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను మనసా వాచా కర్మణా మాలిని నీ ప్రేమించాను. నువ్వు మాలిని నీ అక్క ,అక్క అని పిలుస్తావు కదా మరి తన స్థానంలో నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు. నువ్వు అమాయకురాల లేదా అబద్దాలకోర నాకు అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడు మల్లి కోపంతో పాల గ్లాస్ కింద పడేస్తుంది. మొదటి నుండి కూడా నా ప్రమేయం లేకుండా ఏమైనా జరిగిందా అలా జరిగితే ఇప్పుడు చెప్పండి ఆ సీతారామ సాక్షిగా నా చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను.

Advertisement
Malli's friends make arrangements for Malli and Aravind's nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals
Malli’s friends make arrangements for Malli and Aravind’s nuptial night. Later, Aravind has a fallout with Malli regarding the rituals

నేను ఏం చేయకపోయినా మొదటినుండి నన్ను తిడుతూనే ఉన్నారు. అసలు మీరు చేయకపోయినా మొదటినుండి నన్ను తిడుతూనే ఉన్నారు. అసలు మీరు అడిగారని నేను ఆరోజు అమ్మవారి కుంకుమ కోసమని గుడికి తీసుకెళ్ళాను. వర్షం కారణంగా మన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది నేను మనం ఇక్కడి నుండి వెళ్ళాలి అని ఎంత చెప్పినా మీరు వినలేదు. మా వూరి కట్టుబాట్ల ప్రకారం ఒక అమ్మాయి రాత్రి అంతా బయట ఉండకూడదు అని చెప్పిన మీరు అర్థం చేసుకోలేదు.

Advertisement

నా తప్పు ఏం లేకపోయినా ఇప్పటికీ నన్ను నిందిస్తున్నారు. ఈ ఒక్కరోజు ఇక్కడ గడిపి రేపు మీరు మీ ఇంటికి వెళ్లిపోతారు. అక్కడ మీ అమ్మ ,నాన్న ,భార్యతో సంతోషంగా ఉంటారు. కానీ రేపటి నుంచి నా పరిస్థితి ఏంటి మీ దృష్టిలో నేను నీ భార్యను కాకపోయినా ప్రపంచం దృష్టి లో నేను ఒక పెళ్లైన అమ్మాయి ఇక జీవితాంతం నేను పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండాలి. మా అమ్మే నయం ఏదో ఒక రోజు మా నాన్న వస్తాడు అని ఆశగా ఎదురుచూస్తుంది. కానీ నాకు ఆ అవకాశం కూడా లేదు. నా జీవితంలో ఒకే ఒక కోరిక నేను బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకోవాలని కానీ ఇప్పుడు అది కూడా నెరవేరలేదు అంటుంది. ఇక రేపు ఏం జరగబోతుందో చూడాలి.

Advertisement

Read Also :  Malli Serial Aug 1 Today Episode : సత్య, మీరాల ముందు తన భార్య పేరు చెప్పిన అరవింద్.. ఊరి ఆచారాలు మల్లి, అరవింద్‌ను దగ్గర చేస్తాయా?

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు