Devatha july 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య, దేవికి ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య దేవికి గోరుముద్దలు తినిపిస్తూ ఉండగా అప్పుడు దేవి ఎందుకు సారు నేనంటే మీకు అంత ఇష్టం అని అంటుంది. అప్పుడు ఆదిత్య ఏమీ మాట్లాడకుండా నువ్వంటే ఇష్టం కాదు ప్రాణం అని మనసులో అనుకుంటాడు. ఇంతలోనే రామ్మూర్తి దంపతులు దేవితో మాట్లాడటం కోసం వీడియో కాల్ చేస్తారు. అప్పుడు ఆదిత్య, దేవీలు రామ్మూర్తి దంపతులతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా వెనుక వైపు నుంచి చూసిన మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఆ తర్వాత మాధవ అక్కడి నుంచి రాధా దగ్గరికి వెళ్లి రాధ నా వాచ్ ఎక్కడ ఉందో ఇవ్వు నేను ఆఫీసర్ సార్ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మన ఇంటికి భోజనానికి పిలుస్తున్నాను అని అనడంతో రాధ షాక్ అవుతుంది. అయితే నీకు చెప్పకుండా వెళ్లి చెప్దాము అని అనుకున్నాను కానీ చెప్పాల్సి వస్తోంది. నిన్ను పిలుచుకొని వెళ్ళాము అంటే నువ్వు రాను అంటావు అందుకే నేను ఒక్కడినే వెళుతున్న అని అనడంతో రాధా షాక్ అవుతుంది.
Devatha july 12 Today Episode : ఆదిత్యను బాధపెట్టిన సత్య..రుక్మిణి టెన్షన్…
మరొకవైపు ఆదిత్య దేవి ఇద్దరి పోటాపోటీగా చెస్ ఆడుతూ ఉంటారు. ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి దేవిని పాలు తాగడానికి పిలుస్తుంది. అప్పుడు దేవుడు ఎప్పుడూ ఇదేనా అంటూ కాస్త అల్లరిగా మాట్లాడుతుంది. అప్పుడు ఆదిత్య కూడా దేవుడమ్మకు సపోర్ట్ గా మాట్లాడడంతో వెంటనే దేవి అంతేలే సారు అంటూ కాస్త అలిగినట్లు మాట్లాడుతుంది.
అప్పుడు ఆదిత్య నువ్వు నా కూతురివి అని మనసులో అనుకుంటూ ఉండగా అదే సమయంలో మాధవ అక్కడికి వచ్చి నీకు నేనున్నాను నువ్వు ఒంటరివి కాదు అని అనడంతో ఆదిత్య షాక్ అవుతాడు. మాధవని చూసిన దేవి దగ్గరికి వెళ్లి ప్రేమగా హత్తుకుంటుంది. అప్పుడు ఆదిత్యను చూస్తూ నేను నీకు ఒక ఆట నేర్పిస్తాను అని మాధవ అనగా వెంటనే దేవి, మీరు నన్ను గెలిపించడానికి ప్రతిసారి ఓడిపోతూ ఉంటారు అదే ఆఫీసర్ సారు అయితే ప్రతి ఒక్కటి నాతోనే ఆడిస్తారు అని అంటుంది.
సరే పద దేవి ఇంటికి వెళ్లి ఆడుకుందాం అని అనగా వెంటనే దేవుడమ్మ రేపు బోనాలు ఉన్నాయి అది చూసుకొని వస్తుంది అని అనటంతో వెంటనే మాధవ తాము కూడా బోనాలు చేస్తున్నాం అని అంటాడు. అప్పుడు దేవి కూడా అక్కడే ఉంటాను అని అనడంతో మాధవ చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మాధవ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో రాధ టెన్షన్ పడుతూ ఉంటుంది.
మాధవ ఎందుకు అలా చేస్తున్నాడు అర్థం కాక రుక్మిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు సత్య ఆదిత్య దగ్గరికి వచ్చి ఎందుకు తండ్రి కూతుర్లను దూరం చేస్తున్నావు అని అడగగా నేను ఏమీ అనలేదు సత్య దేవి నేను ఇక్కను నుంచి వెళ్ళను అంటుంది అని అనగా అలా అనేలా చేసింది నువ్వే కదా అంటూ తన మాటలతో బాధపెడుతుంది సత్య. మరొకవైపు మాధవ రాధ దగ్గరికి వెళ్లి రాధ నూతన మాటలతో మరింత భయపడతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World