Vijay Deverakonda : లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. లైగర్ సినిమా రిలీజ్ కాకముందే మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ ప్రమోషన్స్ కూడా వేగవంతం చేసి చిత్ర యూనిట్. ఎప్పటికప్పుడూ అప్ డేట్స్ రిలీజ్ చేయడంతో లైగర్ మూవీ ఎప్పుడు వస్తుందా? అనే ఆత్రుత అభిమానుల్లో నెలకొంది.
విజయ్ దేవరకొండతో పాటు లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఎంతమాత్రం తగ్గడం లేదు. ఇద్దరూ కలిసి లైగర్ మూవీకి ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కాఫీ విత్ కరణ్ షో (Koffee With Karan)లో లైగర్ జోడీ సందడి చేసింది. ఈ షో ప్రోమోలు కూడా రిలీజ్ చేయడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ షోలో కెరీర్, ప్రేమ, రొమాన్స్ లాంటి అంశాలపై కరణ్ సమాధానాలు రాబట్టారు. హీరోయిన్ అనన్య పాండే తన మనసులోని కోరికను బయటపెట్టేసింది. విజయ్ దేవరకొండను నగ్నంగా చూడాలని ముచ్చటగా ఉందని ఓపెన్‌గా చెప్పేసింది.
Vijay Deverakonda : విజయ్ దేవరకొండపై అనన్య పాండేకు ఇంత క్రష్ ఉందా?
రాపిడ్ ఫైర్ అంటూ అనన్యను కరణ్ అడిగారు. విజయ్ దేవరకొండని నగ్నంగా చూడాలని ఉందా? అని అడగడంతో వెంటనే అనన్య పాండే ఓపెన్‌గా అవును అని చెప్పేసింది. లైగర్ మూవీలో చూశాను కానీ, మొత్తంగా చూడలేదు. అలాంటి అవకాశం వస్తే.. విజయ్‌ను ఇష్టపడే ప్రతి ఒక్కరూ కోరుకోకుండా ఉంటారా? అని అనేసింది. నాకు కూడా విజయ్ ను నగ్నంగా చూడాలనే ఉందంటూ అనన్య పాండే పచ్చిగా అనేసింది. నాకు సైట్ కొట్టకు అంటూ అనన్యతో విజయ్ దేవరకొండ అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ అనన్య పాండే రొమాన్స్ చూస్తే మెంటలెక్కిపోవాల్సిందేనట.. టాలీవుడ్ రౌడీ స్టార్‌గా ఉన్న విజయ్ దేవరకొండ ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ కానున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రియల్ లైఫ్ బాక్సర్‌గా కెమెరా ముందు టైసన్ బాక్సింగ్ చేయబోతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా లైగర్ మూవీ ఆగస్టు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Read Also : Vijay Devarakonda : హీరోయిన్ ఒడిలో సేదతీరిన లైగర్ రౌడీ.. వీడియో వైరల్..!