Intinti Gruhalakshmi Nov 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పరందామయ్య కాఫీ పెట్టుకోవడానికి అని కిచెన్ లోకి వెళ్తాడు.
ఈరోజు ఎపిసోడ్లో ప్రేమ్ కాయగూరలు తీసుకుని వచ్చి బారెడు పొద్దెక్కిన తులసి ఇంకా లేవకపోవడంతో తన అమ్మమ్మని పిలిచి అమ్మమ్మ నేను ఎనిమిదవ వింత చూస్తున్నాను అమ్మమ్మ అనడంతో ఎక్కడరా అనగా ఇదిగో మీ ఇంట్లోనే మా అమ్మని చూడు అని అంటాడు ప్రేమ్. ఎప్పుడూ సూర్యుడిని నిద్ర లేపే మా అమ్మ ఈరోజు సూర్యుడు నడి నెత్తికి వస్తున్న కూడా ఇంకా నిద్ర లేకపోవడం ఏంటి అని అంటాడు. అప్పుడు తులసి వాళ్ళ అమ్మ నిద్రపోతే నీకేమి అడ్డం అని అనగా నాకు ఏమి అడ్డం లేదు కూతుర్ని పడుకోబెట్టి కోడలతో పని చేస్తున్నావు అంటూ అమ్మమ్మకి అత్తయ్య మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు.
ఏంట్రా ప్రేమ్ అత్తమ్మ కోడలి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా లేదులే అమ్మమ్మ అని అంటాడు. నేను మీ అమ్మని రెండు మూడు సార్లు నిద్ర లేపాను రెండు నిమిషాలు అని చెప్పి అలాగే పడుకుంటుంది అనడంతో మా అమ్మని ఎలా లేపాలో నాకు తెలుసు అని చెప్పి ప్రేమ్ పరంధామయ్యలా గొంతు మార్చి అమ్మ తులసి కాఫీ అని అడగడంతో వెంటనే తులసి అక్కడికి వస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చి తులసి ప్రేమ్ చెవిని మెలేస్తూ ఇలాంటి చిలిపి పనులు చేస్తావా అని అంటూ ఉంటుంది. అప్పుడు వారందరూ సంతోషంగా ఉంటారు.
మరొకవైపు పరంధామయ్య కిచెన్ లో కాఫీ పెట్టుకుంటూ ఉండగా అనసూయ అక్కడికి వచ్చి ఏంటండీ మీరు పెట్టుకుంటున్నారు నేను కాఫీ తెస్తాను అని అనగా పరంధామయ్య పక్కకు తప్పుకో అన్న విధంగా చూస్తాడు. అప్పుడు ఆ తులసి నా తల్లి ఇంట్లో వెళ్లిపోయినప్పటి నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు పక్కకు వచ్చి కూర్చున్న పట్టించుకోవడం లేదు నేను ఏం తప్పు చేశాను అండి అని అనసూయ మాట్లాడుతూ ఉండగా పరంధామయ్య మాత్రం టీ పెట్టుకుని చివరిలో వెళ్తూ మనిద్దరం తప్పు చేయలేదు ఆ దేవుడు తులసి జీవితంలోకి సామ్రాట్ ని 26 ఏళ్ల క్రితమే పంపించి ఉంటే ఎంతో బాగా ఉండేది తులసి జీవితం బాగుపడేది అని అంటాడు.
intinti gruhalakshmi 3-11-2022 serial : అభి షాక్..
మరొకవైపు తులసి ఇంట్లో పూజ చేస్తూ తులసి మొక్కకు తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అంకిత వంట చేస్తూ ఉండగా అభి ఇంకా ఇంత లేటా నేను ఆఫీస్ కి వెళ్ళాలి ఖాళీగా కూర్చోలేదు అని అనటంతో అంకిత అక్కడికి వచ్చి అబీ పై సీరియస్ అవుతుంది. అప్పుడు తులసి గురించి ప్రస్తావిస్తూ మీ అమ్మ వెళ్ళిపోయినందుకు బాధ లేదా అనడంతో నాకు బాధ ఉంది అంకిత కానీ మామ్ చేసిన తప్పు అనిపించింది అందుకే చెప్పాను అని అంటాడు. అంకిత నువ్వు తప్పు చేస్తున్నావ్ అని నాకు అనిపిస్తుంది నేను వదిలేస్తాను అనడంతో అభి షాక్ అవుతాడు.
టిఫిన్ ఈరోజు మాత్రమే కాదు అవి ఇప్పటినుంచి రోజు ఇలాగే లేట్ అవుతుంది సర్దుకోవడం నేర్చుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు అనసూయ బట్టలు మడతేస్తూ తులసి ఇన్ని పనులు ఎలా చేసేదో చేసుకోలేక చచ్చిపోతున్నాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి సామ్రాట్ తులసీల గురించి లేనిపోనివన్నీ చెప్పి ఆస్తిని మన పేరు మీద రాయించుకోండి అంటూ అనసూయని రెచ్చగొడుతుంది.
ఆ తర్వాత తులసి ఆఫీస్ కి వెళ్తూ ఉండగా ప్రేమ్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉండడంతో అది చూసి దీపక్ అతని భార్య సంతోష పడుతూ ఉంటారు. ఇంతలోనే తులసి వాళ్ళ అమ్మ ప్రేమ్ కీ తులసికి క్యారేజ్ తీసుకుని వస్తుంది. ఆ తర్వాత తులసి ప్రేమ్ లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అనసూయ కూరగాయలు కొనడానికి వెళ్ళగా అక్కడి తులసి గురించి తలా ఒక మాట తప్పక మాట్లాడడంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
Read Also : Ennenno Janmala Bandham : ఆదిత్య, ఖుషి మధ్యలో నలిగిపోతున్న యష్.. సంతోషంలో వేద..?