Telugu NewsLatestGuppedantha Manasu Nov 3 Today Episode : ఏకాంతంగా గడుపుతున్న వసుధార రిషి.. ధరణి...

Guppedantha Manasu Nov 3 Today Episode : ఏకాంతంగా గడుపుతున్న వసుధార రిషి.. ధరణి మాటలకు ఆశ్చర్యపోయిన దేవయాని..?

Guppedantha Manasu Nov 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార పుష్ప తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార జీవితంలో అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను. అమ్మ నాన్న అందరినీ వదిలేసాను. చదువుతూ ఉద్యోగాలు చేసి కష్టపడుతున్నాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఏం జరిగింది అని అడగడంతో రిజల్ట్ వస్తున్నాయి కదా సరే అందుకే టెన్షన్ గా ఉంది అని అనగా వెంటనే రిషి అవుతాడు. డి బి ఎస్ టి కాలేజ్ యూత్ ఐకాన్ అయిన వసుధార ఇలా భయపడుతోందా అసలు వసుధార నువ్వేనా అని అంటాడు రిషి.

Advertisement
Guppedantha Manasu Nov 3 Today Episode
Guppedantha Manasu Nov 3 Today Episode

అది కాదు సార్ చివరి ఎగ్జామ్ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ నాకు వణుకు పుడుతోందిఅంటూ వసుధార టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు రిషి వసుధార చేతులు పట్టుకొని టెన్షన్ పడకు వసుధార అంటూ ధైర్యం చెబుతూ ఉంటాడు. అప్పుడు సర్ ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉంది అని అంటుంది వసుధార. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు రిషి వసుధార ఈ అర్ధరాత్రి పూట ఈ చెరువు దగ్గరికి ఎందుకు పిలుచుకొని వచ్చావు అని అడగడంతో వెంటనే వసు సార్ ఈ అర్ధరాత్రి సమయంలో నగరం అంతా నిద్రపోతుండగా మనం ఈ నీటిలో ఈ కాగితపు పడవలను వేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా సార్ అని అనడంతో వెంటనే రిషి కొంచెం కొత్తగా ఉంటుంది కానీ బాగానే ఉంటుంది అని అంటాడు.

Advertisement

అప్పుడు వసుధార నీకు ఇటువంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయి అనటంతో వెంటనే వసు మా ఊర్లో ఇలాగే చేసే వాళ్ళం సార్ అని చెప్పి ఆ విషయం గురించి చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత వారిద్దరూ ఆ కాగితపు పడవల మీద వారి మనసులో అనుకున్నది కోరుకున్నది రాసి వాటిని నెలలో వదిలి దండం పెట్టుకుంటారు. అప్పుడు వసుధార, రిషి ఇద్దరు ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. మరొకవైపు దేవయాని కిందికి వచ్చి ధరణి అని గట్టిగా అరుస్తుంది.

Advertisement

Guppedantha Manasu నవంబర్ 3 ఎపిసోడ్ : వసుధార టెన్షన్.. చెప్పిన ధైర్యం రిషి..

ఏమైంది అత్తయ్య అని అనడంతో మన ఇంట్లో ఇన్ని రూములు ఉండగా నువ్వు వంట రూమ్ లోనే ఉంటావా అని అరుస్తుంది దేవయాని. అప్పుడు రిషి ఎక్కడికి వెళ్ళాడు అని అనడంతో బయటికి వెళ్లాడు అత్తయ్య అని అనగా దేవయాని ఒక్కసారిగా షాక్ అయ్యి ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్లాడు అని అంటుంది. అప్పుడు ధరణి మౌనంగా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో వెంటనే దేవయాని నోరు విప్పి ఏదో ఒక మాట చెప్పు ధరణి అందరిని నేను మాటల్లో ఇబ్బంది పెడితే నువ్వు మాత్రం నీ సైలెంట్ తో నాకు టార్చ్ చూపిస్తున్నావు అని అంటుంది.

Advertisement

అప్పుడు ధరణి ఏం తెలియనట్టుగా కొత్త వెటకారంగా మాట్లాడడంతో ధరణి మాటలు అర్థం కాక తల గీక్కుంటూ ఉంటుంది దేవయాని. ఆ తర్వాత ధరణి పై కోప్పడి అక్కడినుంచి పంపించేస్తుంది. అప్పుడు వసుధారా రిషులు రోజురోజుకీ దగ్గరవుతున్నారు. ఇలాగే వదిలేస్తే నేను వినకూడని వార్త ఈ ఇంట్లో జరగకూడని శుభకార్యం ఏదో జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. మరొకవైపు వసు రిషి కారులో వెళ్తూ ఉండగా వసుధర రిషిని జెంటిల్మెన్ అంటూ పోగుడుతూ ఉండడంతో వెంటనే రిషి కారు ఆపుతాడు.

Advertisement

ఏమైంది సార్ అని అడగడంతో నువ్వు నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు అని అనగా లేదు సార్ మీలాంటి జెంటిల్మెన్ ఒక్కరే ఉంటారు అందరికీ ఆ అదృష్టం దొరకదు కదా అని అంటుంది వసుధర. మరి కొంపదీసి ఈ జెంటిల్మెన్ అందరికీ పంచుతావా ఏంటి అంటూ కామెడీగా మాట్లాడుతాడు. ఆ తర్వాత లేదు సార్ అదృష్టాన్ని ఎవరైనా ఆస్వాదించాలి అనుకుంటారు కానీ పంచాలి అనుకుంటారా అంటుంది వసుధార. అలా వారిద్దరూ చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు.

Advertisement

Read Also : Guppedantha Manasu: మరింత దగ్గరవుతున్న వసు,రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు