Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్ దీప గురించి డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది అని అనగా వెంటనే ఆ డాక్టర్ అలా ఉంటే చాలా కష్టం కదా డాక్టర్ ఆపరేషన్ చేసే సమయంలో బిపి నార్మల్ గా ఉండాలి అని అనగా అది నేను చూసుకుంటాను అని అంటాడు కార్తీక్. అప్పుడు ఆ డాక్టర్ ఆవిడ ఏ విషయం గురించి చాలా ఇబ్బంది పడుతోంది ముందు ఆ విషయాన్ని పరిష్కరించండి అని అంటుంది. ఆ తర్వాత నేనే మా ఆవిడకు ఆపరేషన్ చేస్తున్నట్టు తనకు తెలియకూడదు అని అనగా ఆ డాక్టర్ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తిక్ నేనే ఆపరేషన్ చేశాను అని దీపకు తెలిస్తే నాకు గతం గుర్తుకు వచ్చిందని సంతోషపడుతుంది అప్పుడు మరింత కష్టమవుతుంది.
ఆపరేషన్ అయిన తర్వాత ఒక్కొక్క విషయం నిదానంగా చెప్పి దీపకు సర్ది చెప్పాలి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు మోనితను పిలుచుకుని వెళ్లిన సౌందర్య ఒక గదిలో బంధించి నువ్వు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది. ఆంటీ ప్లీజ్ అండి నాకు ఒక్క ముఖ్యమైన పని ఉంది అని మోనితను ఎంత అడిగినా కూడా సౌందర్య వినిపించుకోకుండా నోరు ముయ్యి అనే గట్టిగా అరిచి మోనితను లోపల బంధించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మోనితను ఈ కార్తీక్ దీప ఎక్కడికి వెళ్లారు ఒకవేళ గతం గుర్తుకు వచ్చింది ఇక్కడికి వస్తారు కదా వస్తే రాని నాకేంటి అని అనుకుంటూ ఉంటుంది.
మరొకవైపు దీపకి స్పృహ రావడంతో శౌర్య గురించి ఏమైనా వెతికారా డాక్టర్ బాబు దొరికిందా అని అనగా ఇన్ని రోజులు నుంచి వెతికినా దొరికింది ఇప్పుడే ఎలా దొరుకుతుంది దీప అని అంటాడు. మీకు చెప్పిన అడ్రస్కు వెళ్లారా అడిగారా అని అడగగా అవని ఇప్పుడు ఎందుకు దీప నువ్వు మౌనంగా ఉండు నేను చూసుకుంటానని చెప్పాను కదా అని అంటాడు. ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు ఆ తర్వాత సౌర్య గురించి ఆలోచించు అని అనగా మాట్లాడకండి డాక్టర్ బాబు పదేపదే ఆరోగ్యమని అంటుంటారు నా బిడ్డ నా దగ్గర లేనప్పుడు ఆరోగ్యం ఉండి ఏం చేసుకోవాలి అని మొండిగా మాట్లాడుతుంది దీప.
అప్పుడు కార్తీక్ ఏదో చెప్పినా వినిపించుకోకుండా నేను వెళ్తాను డాక్టర్ బాబు సౌర్యని వెతుక్కుంటాను అని అక్కడి నుంచి వెళ్లడానికి బయలుదేరిన వెంటనే కార్తీక్ సీరియస్ అవుతాడు. ఎందుకు దీప చెప్తే వినడం లేదు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా శౌర్య వస్తే ఏదైనా చేసి పెట్టడానికి ప్రేమగా చూసుకోవడానికి ఉంటుంది అని దీపకు ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత మరొకవైపు ఇంద్రుడు చంద్రమణి ఒక చోటికి పిలుచుకొని వెళ్లి అసలు విషయం చెప్పడంతో సరే గండ నువ్వు చెప్పినట్టే చేద్దాం. మన సౌర్యమ్మను వాళ్లకు అప్పగించేద్దాం ఇకపై నీకు నువ్వు నాకు నేను అంతే అని ఎమోషనల్ అవుతూ ఉంటారు చంద్రమ్మ దంపతులు.
మరొకవైపు కార్తీక్ పోస్టర్లో నెంబర్ కి ఫోన్ చేసి ఆ అడ్రస్ కి వెళ్ళి నీకు ఇంద్రుడు తెలుసా అని అనగా తెలియదు సార్ అని అబద్ధాలు చెబుతాడు. ఆ ఇంద్రుడు అనవసరంగా నాకు ఫోన్ ఇచ్చాడు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు చెప్తే చంపేస్తాడు లేకపోతే వీళ్ళతో ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి. అప్పుడు కార్తీక్ నిజంగానే తెలియదా అని అనగా తెలియదు బాబు అనడంతో ఆ ఇంద్రుడు ఏదో ఒకరోజు దొరుకుతాడు దొరికిన రోజు నీ హస్తం ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవిస్తావు అని అనడంతో అతను నాకు నిజంగానే తెలియదు బాబు అనే అబద్ధాలు చెబుతాడు.
మరొకవైపు దీప హాస్పిటల్ లో సౌర్య ఫోటో పట్టుకుని అందరినీ అడుగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన కార్తీక్ దీప పడిపోతుండగా ఏంటిది దీప ఇది నిన్ను ఒక చోట కూర్చొని చెప్పాను కదా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అంటాడు. బయటికి వెళ్లొద్దు అన్నారు కదా డాక్టర్ బాబు అందుకే ఇక్కడే ఉన్నాను అని అనగా ఇక్కడికి కూడా రాకూడదు అని అంటాడు కార్తీక్.
Tufan9 Telugu News And Updates Breaking News All over World