Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి మొబైల్ ఉన్నా ఫోటోస్ అన్ని అఖిల్ డిలీట్ చేస్తాడు.
ఈ రోజు ఎపిసోడ్ లో జానకి తెల్లవారినా నిద్రపోతూ ఉండగా రామచంద్ర వచ్చి నిద్రలేపి తాను పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరొకవైపు మల్లిక, విష్ణు తో అత్తయ్య గారు మనకు డిపాజిట్ చేసిన డబ్బులు ఇస్తారని అన్నారు కదా దాని గురించి అడగండి అని అంటుంది. అప్పుడు విష్ణు ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇప్పుడే వెళ్లి అడగాలి అని బలవంత పెడుతుంది.
ఇక జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి డబ్బులు విషయం గురించి అడగగా అప్పుడు జానకి చదువు విషయం తెలియదు కాబట్టి ఇస్తానని చెప్పాను ఇప్పుడు ఏ నిమిషం అవసరం వస్తుందో తెలియదు కదా అని అంటుంది జ్ఞానాంబ. జానకి,అఖిల్,వెన్నెల ముగ్గురు చదువు కోసం డబ్బులు కావాలి అని అంటుంది. అప్పుడు విష్ణు సరే అని మల్లిక పై సీరియస్ అవుతాడు.
ఆ తర్వాత జానకి , నీకోసం వెతుకుతూ ఉండగా ఇంతలో అఖిల్ కనిపించడంతో జానకి అఖిల్ ను గట్టిగా నిలదీస్తుంది. అప్పు చేసి ఏం తెలియనట్టుగా తిరుగుతున్నావు ఇది ఇంట్లో తెలిస్తే ఎంత రచ్చ అవుతుందో తెలుసా అని అంటుంది. అప్పుడు అఖిల్ తప్పించుకోవడానికి తనది ఎటువంటి తప్పులేదు అనడంతో వెంటనే జానకి కొట్టబోతుంది.
ప్రేమించి చివరికి ఇలా మోసం చేస్తావా నేను అందరికీ నీ ముందు నిజం చెప్పేస్తాను ఫోటోలు బయట పెడతాను అని ఫోటోలు చెక్ చేయగా ఫోటోలు లేకపోవడంతో ఫోటోలు లేకపోతే నేను డిఎన్ఏ టెస్ట్లు రిపోర్టులు ఉన్నాయి అఖిల్ నువ్వు ఎస్కేప్ అయ్యాను అనుకోకు అని అంటుంది జానకి. నీకు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను ఏం చెప్తావో నువ్వే తెలుసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి.
మరొకవైపు జెస్సి ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి తన అమ్మానాన్న వచ్చి ఇప్పటికైనా నీ కడుపు కారణమైన మనిషి ఎవరో చెప్పు అని బ్రతిమలాడుతూ ఉంటారు. అప్పుడు అఖిల్ గురించి ఆలోచించిన జెస్సి ఇంకొద్ది రోజులకు చెబుతాను అని అంటుంది. కానీ తన పేరెంట్స్ మాత్రం ఇప్పుడే చెప్పాలి అని పట్టుబడతారు.
చెప్పకపోతే మేమిద్దరం విషయం తాగి చచ్చిపోతాము అని వాళ్ళు బెదిరించగా జెస్సి ఇవ్వాలని ఆపి జ్ఞానాంబ మూడో కొడుకు అఖిల్ అని చెప్పడంతో వారిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరొకవైపు మల్లిక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి తింటి మీద తిండి లాగేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పనిమనిషి వచ్చి వెటకారంగా మాట్లాడిస్తుంది. ఇంతలోనే జానకి అక్కడికి వచ్చి అఖిల్ ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు అఖిల్ తన గదిలో ఉన్నాడు అని అక్కడికి వెళ్తుంది జానకి.