Telugu NewsLatestJanaki Kalaganaledu: జానకీ మొబైల్ లో ఫొటోస్ డిలీట్ చేసిన అఖిల్..విష్ణుని బంగారు గాజులు అడిగిన...

Janaki Kalaganaledu: జానకీ మొబైల్ లో ఫొటోస్ డిలీట్ చేసిన అఖిల్..విష్ణుని బంగారు గాజులు అడిగిన మల్లిక..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో అఖిల్ సంతోషంగా ఉండగా జానకి, అఖిల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో అఖిల్ ఆనందంగా ఇంట్లో వాళ్ళతో కలిసి క్యారం బోర్డు ఆడుతుండగా జానకి మాత్రం అఖిల్ వైపు కోపంతో చూస్తూ ఉంటుంది. అది గమనించిన మల్లిక వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అఖిల్ ఆలోచించుకుంటూ గేమ్ తప్పుగా ఆడగా వెంటనే రామచంద్ర అఖిల్ వైపు ఆడి అఖిల్ ను గెలిపిస్తాడు. దాంతో జ్ఞానాంబ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అఖిల్ కోసం రామచంద్ర జీవితంలోనే ఓడిపోయాడు అఖిల్ కోసం తన చదువును కూడా త్యాగం చేశాడు అని చెబుతుంది జ్ఞానాంబ.

Advertisement

Advertisement

ఆ తర్వాత రామచంద్ర జానకి కోసం గాజులు తెచ్చాను అని కూర్చోబెట్టి జానకికి ఇవ్వడంతో జానకీ అవి చూసి మురిసిపోతూ ఉంటుంది. ఒకవైపు ఆనందంగా ఉంటూనే మరొకవైపు అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర ఏం జరిగింది జానకి గారు అలా ఉన్నారు అని అడగగా ఏమీ లేదు రామ గారు పరీక్ష గురించి ఆలోచిస్తున్నాను అని అబద్ధం చెబుతుంది జానకి. అప్పుడు చాటు నుంచి చూస్తున్న మల్లికా ఎలా అయినా మా ఆయనతో బంగారు గాజులు కొనిచ్చుకోవాలి అని పడుకున్న విష్ణు ని లేపి బంగారు గాజులు కావాలి అని అడుగుతుంది.

Advertisement

అప్పుడు ఈ టైంలో ఎందుకు మల్లిక అని అనడంతో వెంటనే మల్లిక బావగారు జానకికి మట్టి గాజులు కొనిచ్చారు అని అంటుంది. ఇప్పుడు వెంటనే విష్ణు ఓహో ఇవన్నీ కడుపుతో ఉన్నప్పుడు వచ్చే ఆశలు కాదన్నమాట తోటి కోడలు మీద ఉన్న కుళ్ళు తో వచ్చే ఆశలు అన్న మాట అని అంటాడు. అప్పుడు వెంటనే మళ్ళీ మీకోసం వారసుల్ని ఇస్తున్నాను కదా నాకోసం బంగారు గాజులు ఇవ్వలేరా అని అంటుంది.

Advertisement

అందుకు విష్ణు సరే అనడంతో ప్రేమగా విష్ణు కాళ్లు పడుతుంది మల్లిక. తర్వాత జెస్సి జానకి ఫోన్ చేసి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా అక్క అని అడుగుతుంది. అప్పుడు జానకి మీరు తొందరపడి చేసిన విషయం ఇది సద్దుమనగాలి అంటే ఇంకా సమయం పడుతుంది అని అంటుంది జానకి. అప్పుడు జానకి మాటలు విన్న అఖిల్ జెస్సీ వదినకు అంత చెప్పేసినట్టు ఉంది అని అనుకుంటూ ఉంటాడు.

Advertisement

అప్పుడు జానకి వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను పెట్టమని ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత అఖిల్, రామచంద్ర జానకి నిద్రపోయిన తర్వాత జానకి ఫోన్ తీసుకొని ఆ ఫోటోలు అన్ని డిలీట్ చేస్తాడు. అప్పుడు అఖిల్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి జ్ఞానాంబ బయట ఉంటుంది. ఏం చేస్తున్నావు అని అడగడంతో చదువుకుంటున్నాను అని అబద్ధం చెబుతాడు అఖిల్.

Advertisement

అప్పుడు సరైన చదువుకుంటూ ఉందో నేను వెళ్లి టీ తీసుకుని వస్తాను నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అనడంతో అఖిల్ తనలో తానే బాధపడుతూ ఉంటాడు.. అసలు విషయం తెలిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు అఖిల్.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు