Janaki Kalaganaledu: జెస్సి తల్లిదండ్రులను కన్విన్స్ చేసిన జానకి.. నిజం ఒప్పేసుకున్న అఖిల్..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో మల్లిక, చికిత ఇద్దరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో చికిత, మల్లిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. అఖిల్ గురించి అడిగి అఖిల్ గదిలో ఉన్నాడు అని తెలియగానే అక్కడికి వెళుతుంది. ఇక అఖిల్ దగ్గరికి వెళ్లిన జానకి, జెస్సి విషయంలో ఏమి నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఏం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నావు అత్తయ్య గారికి నిజం చెప్పక తప్పదు అని అంటుంది జానకి. ఇంతలోనే జ్ఞానాంబ అందర్నీ పిలిచి కొత్త బట్టలు ఇస్తుంది.

అప్పుడు జానకి అఖిల్ వైపు కోపంగా చూస్తూ ఉండగా అది మల్లిక గమనిస్తూ ఉంటుంది. జానకికి జెస్సి ఫోన్ చేసి అఖిల్ నా ప్రెగ్నెన్సీకి కారణం అని మా అమ్మ నాన్నలకు చెప్పాను అనడంతో జానకి షాక్ అవుతుంది. జానకి జెస్సి తో మాట్లాడుతూ ఉండగా మల్లిక ఆ మాటలు వినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అఖిల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడు.

జానకి జెస్సీ తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడు వారిని బయట నిలబెట్టి మాట్లాడుతూ ఉండగా మల్లిక వారి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు జానకి వారిని మీ తొందరపాటుతో మీ అమ్మాయి జీవితం నాశనం చేయకండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ జెస్సి తల్లిదండ్రులు మాత్రం జానకి మాటలు వినిపించుకోకుండా ఎలాగైనా మీ అత్తమామలతో అడగాల్సిందే మాట్లాడాల్సిందే అని గట్టిగా మాట్లాడుతారు.

అప్పుడు ఒకవేళ గొడవ చేస్తే మీ అమ్మాయి జీవితం బాగుపడుతుంది అనుకుంటే అలాగే వెళ్ళండి లేదు అంటే నా మాట విని మీరు ఏం మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని అంటుంది జానకి. నన్ను నమ్మండి అని చెప్పి జానకి వాళ్లకు సర్ది చెబుతుంది. అప్పుడు మల్లికా ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు మా జానకి ఇప్పుడు అఖిల్ ఇంటికి రాగానే ఎలా అయినా అత్తయ్య మామ కి నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది.

ఇక ఇంతలోనే అఖిల్ రాగానే జానకి అఖిల్ తో మాట్లాడుతూ నీకు ఇచ్చిన టైం అయిపోయింది నువ్వు తప్పించుకుంటూ తిరుగుతున్నావు నేను ఇంట్లో చెబుతాను అని అంటుంది. అప్పుడు అఖిల్ వద్దు వదిన అంటూ జానకిని బ్రతిమిలాడుతూ ఉంటాడు. మోసం చేసే ఉద్దేశం నాకు లేదు అని అంటాడు అప్పుడు జానకి నా మాటలు నమ్ము నేను అత్తయ్య గారిని ఒప్పిస్తాను ఏమీ అనకుండా చూసుకుంటాను అని అన్నా కూడా అఖిల్ మాత్రం వద్దు వదిన అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు.