Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి రామ్మూర్తి కి ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్న ఇంటికి తొందరగా రండి అని మాట్లాడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య రాదను కలవడానికి వెళుతూ ఉండగా అప్పుడు సత్య అడ్డుపడి ఎక్కడికి వెళ్తున్నావు ఇంట్లో ఉండు అని అనటంతో లేదు సత్య వెళ్లాలి అని అంటాడు. దాంతో సత్య కోపంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే దేవుడమ్మ అక్కడికి వస్తుంది. దేవుడమ్మ చెప్పిన కూడా ఆదిత్య వినిపించుకోకుండా సత్యాన్ని తీసుకొని వెళ్ళను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొకవైపు రాధ ఏదో ఆలోచిస్తూ ఉండగా పిల్లలిద్దరూ బట్టల కోసం గొడవ పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వచ్చిన రామ్మూర్తి దంపతులు మాట్లాడుతూ ఉంటారు. మరొక వైపు ఆదిత్య,రాధ కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రాధ వస్తుంది. అప్పుడు ఏమైందిరా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
మళ్లీ ఆ మాధవ నిన్ను ఏమైనా అన్నాడా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అటుగా వెళుతున్న జానకి వారిద్దరిని చూసి అక్కడికి వచ్చి వారి మాటలు వింటుంది. అప్పుడు రాధ ఆదిత్యని పెనిమిటి అని పిలవడంతో ఆ మాటకు జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరొకవైపు రామ్మూర్తి,జానకి తో మాట్లాడుతూ నేను ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు జానకి అని అనడంతో అప్పుడే మాధవ పూలదండలు పూలు గిఫ్ట్ తీసుకుని వస్తాడు.
అనుమానం వచ్చిన జానకమ్మ మాధవని ఫాలో అవుతూ వెళ్లగా మాధవ అవన్నీ పక్కపక్కన పెట్టుకొని రాధా ఫోటో చూస్తూ ఇన్ని రోజులు నీకు అవకాశం దొరికింది ఇక రేపటి నుంచి నీకు ఆ అవకాశం లేదు అని అనడంతో జానకి ఆ మాటలు విని షాక్ అవుతుంది.. ఏదో ప్లాన్ వేశాడు అని భయపడిన జానకి వెంటనే కిందికి వెళ్లి రాదని తీసుకొని ఒక గదిలోకి వెళ్లి రాధ కోసం బంగారు నగలు అన్ని మూటకట్టి ఇచ్చి ఇన్ని రోజులు నువ్వు ఎంత మదనపడ్డావో నాకు అర్థం అయింది ఈ నగలు తీసుకొని ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపో అని అంటుంది జానకి.
అప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని రాధా అడగగా ఆ ఆదిత్య సారు నీ భర్త అన్న విషయం నాకు తెలిసిపోయింది. అంతేకాదు ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధ పడ్డావో నాకు అర్థం అయింది అందుకే దేవుని తీసుకుని రేపు పొద్దున్నే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటుంది జానకి. ఆ మాటలు విని రాధా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World