Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంక ఎపిసోడ్ లో జ్ఞానాంబ జరిగింది మొత్తం అందరికీ వివరిస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి అఖిల్ తో మాట్లాడుతూ ఎందుకు అఖిల్ ఇలా మాట్లాడుతున్నావు ఇలా చేయడం తప్పు అని మాట్లాడుతున్న కూడా వినిపించుకోకుండా అఖిల్ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇక జానకి అఖిల్ మాటలు వింటున్న జ్ఞానాంబ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జానకి ఇప్పటికైనా మించిపోయింది లేదు అఖిల్ ఇప్పటికైనా వెళ్లి అత్తయ్య గారికి నిజం చెబుదాము అని అనగా లేదు వదినా అమ్మకు నేను నిజం చెప్పలేను అని భయపడుతూ ఉంటాడు అఖిల్.
నావల్ల అమ్మ అన్నయ్యని కూడా ఎన్నో మాటలు అనింది. కాబట్టి నా ప్రాణం పోయినా అమ్మకు నిజం తెలియనివ్వను అని అనడంతో ఆ మాటలు విన్న జ్ఞానాంబ షాక్ అవుతుంది. అయితే జానకి, అఖిల్ మాటలు విన్న రామచంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు అఖిల్ ని కొడుతూ నీ మీద ఎన్ని అసలు పెట్టుకున్నాను.
అన్నయ్య నాకు ఇది కావాలి అంటే లేదు ఎందుకు అని అనకుండా కూడా అని నీకు తెచ్చి ఇచ్చాను కదారా అంటూ బాధపడుతూ అఖిల్ ని కొడతాడు రామచంద్ర. నువ్వు ఎప్పుడూ డబ్బులు అడిగితే అప్పుడు ఇచ్చి ఏం అడిగితే అది చేశాను. మీ వదిన నీ గురించి తప్పుగా చెప్పినా కూడా నేనే పెడచెవిన పెట్టి మీ వదిన గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాను అంటూ రామచంద్ర చావ కొడతాడు. అసలు ఒక ఆడపిల్లకు అన్యాయం చేయాలి అని ఎలా అనిపించింది అఖిల్ అంటూ రగిలిపోతూ ఉంటాడు.
అప్పుడు అఖిల్ నా ప్రాణం పోయినా కూడా అమ్మకు నిజం తెలియనివ్వను అని అక్కడి నుంచి పారిపోతాడు. అనంత విన్న జ్ఞానం ఒకచోట కూర్చుని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో రామచంద్ర జానకి అక్కడికి వచ్చి జ్ఞానాంబ ని ఏం జరిగింది అని అనటంతో జ్ఞానాంబ జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు అఖిల్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి జానకి రామచంద్ర కు చెబుతుంది జ్ఞానాంబ.
జరిగింది మొత్తం వివరించడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు జ్ఞానాంబ కోపంతో అఖిల్ చంప పగలగొడుతుంది. అప్పుడు అఖిల్ ని ఈ ఇంట్లో ఉండొద్దు. నీ బతుకు నువ్వు బతుకు ఈరోజు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను నీతో మాట్లాడను అని అనగా రామచంద్ర కన్విన్స్ నుంచి చేయాలని చూడగా జ్ఞానాంబ వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత రామచంద్ర జానకి ఇద్దరు చేసి అఖిల్ కు ధైర్యం చెబుతూ ఉంటారు. మరొకవైపు మల్లిక తన ప్లాన్ మొత్తం రివర్స్ అవడంతో పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జెస్సి కోపంగా కనిపించడంతో అఖిల్ ఓదార్చాలి అని వెళ్లగా నువ్వు నాతో మాట్లాడకు అఖిల్ నువ్వు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటే కోపంతో రగిలి పోతున్నాను అని అనగా అప్పుడు అఖిల్ నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా జెస్సి వినిపించుకోకుండా ఈరోజు నుంచి మనం బయట ప్రపంచానికి భార్యాభర్తలు కానీ ఈ నాలుగు గోడల మధ్య నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అఖిల్ కి షాక్ ఇస్తుంది.
మరుసటి రోజు జెస్సి టీ షర్ట్, నైట్ ప్యాంటు వేసుకొని పేపర్ చదువుత తూ స్టైల్ గా కూర్చోగా ఇంతలో మల్లిక జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి చాడీలు చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ జానకిని పిలిచి ఈ ఇంటి కట్టు బాట్లు నేర్పించమని చెబుతుంది.