YS Sharmila: జగన్ సర్కార్ నిర్ణయం కరెక్ట్ కాదంటున్న షర్మిల.. ఏమైందసలు?

YS Sharmila: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై రాజకీయంగా దుమారం రేగుతూనే ఉందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడంతో ఇకపై డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ కొత్త పేరు అమల్లోకి రాబోతుంది. టీడీపీ మాత్రం తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేరు పెడతామని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఏమాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా ఈ విషయంలో తగ్గేదే లే అంటోంది. అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు. చాలా పార్టీలు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. అధికార పార్టీ నేతలు మాత్రం ఇది సరైన నిర్ణయమేనని పేర్కొంటున్నారు.

తాజాగా హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ అని పేరు మార్చడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై షర్మిలను మీడియా ప్రశ్నించగా… పేరు మార్చకూడదు.. దాని పవిత్రత పోతుందన్నారు. ఒక పేరు పెట్టా.. ఆ పేరును తరతరాలు కంటిన్యూ చేస్తేనే వాళ్లకు గౌరవం ఇచ్చినట్లు ఉంటుదన్నారు. ఒక్కోసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే.. జనాలకు కూడా అర్థం కాదని కన్ ఫ్యూజ్ పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.