Telugu NewsLatestGuppedantha Manasu November 17 Today Episode : గోరుముద్దలు తినిపించుకున్న వసుధార, రిషి.. సంతోషంలో...

Guppedantha Manasu November 17 Today Episode : గోరుముద్దలు తినిపించుకున్న వసుధార, రిషి.. సంతోషంలో జగతి..?

Guppedantha Manasu November 17 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఫణీంద్ర,రిషి, గౌతమ్ మహేంద్ర దంపతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర మహేంద్ర ఆ విధంగా చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అనగా వెంటనే రిషి పెదనాన్న మీరు వెళ్లిన పని ఏమయింది అని అనడంతో రిషి వాళ్ళకూ మన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు విషయం నచ్చింది తొందర్లోనే మనకు ఆ విషయం గురించి అధికారికంగా ప్రకటించనున్నారు అనటంతో రిషి సంతోషపడతాడు. అప్పుడు ఫణీంద్ర ఏందిరా వాళ్ల గురించి నువ్వు బాధపడకు రిషి. ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారు అన్న విషయాల కంటే ఏం చేస్తే ఇక్కడికి వస్తారు అన్న విషయాల గురించి ఆలోచించు అని అంటాడు ఫణీంద్ర.

Advertisement
Guppedantha Manasu November 17 Today Episode
Guppedantha Manasu November 17 Today Episode

మరొకవైపు వసుధార ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రిషి వసుధర కోసం భోజనం తీసుకొని వస్తాడు.. అప్పుడు వసు భోజనం తినడానికి ఎందుకు రాలేదు అని రిషి అడగగా నాకు ఆకలిగా లేదు మీరు తినండి సార్ అని అంటుంది. అప్పుడు వెంటనే రిషి ఒక ఒక చోటకి వసుని పిలుచుకొని వెళ్లి తినమని చెబుతాడు. అప్పుడు వారిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు గోరుముద్దలు తినిపించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వసుధర చేతులు తుడుచుకోవడానికి తన చున్నీ ని ఇస్తుంది. ఆ తర్వాత వసుధారని రిషి వెళ్లి పడుకోమని చెప్పిగుడ్ నైట్ చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

Guppedantha Manasu November 17 Today Episode :  సంతోషంలో జగతి..

ఆ తర్వాత తన గదిలోకి వెళ్లిన రిషి ఎందుకు జగతి మేడం మీరు ఇలా చేశారు వసుధారని ఎందుకు శిక్షిస్తున్నారు అని అనుకుని బాధపడుతూ ఉంటాడు.. అప్పుడు వసుధార తనతో అన్న మాటలు తలుచుకొని రిషి బాధపడుతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే వసుధర వాళ్లకి కాఫీ తీసుకుని వస్తుంది. అప్పుడు దేవయానికి కావాలనే వసుధారని అవమానించే విధంగా మాట్లాడడంతో వెంటనే దేవయాని కి వసుధార తగిన విధంగా బుద్ధి చెబుతుంది.

Advertisement

మరొకవైపు జగతి లాప్టాప్ చూస్తూ ఉండగా ఇంతలో రిషి తనకు మెయిల్ చేయడంతో వెంటనే ఆ విషయాన్ని మహేంద్ర ను పిలిచి మహేంద్ర కు చెప్పి సంతోష పడుతూ ఉంటుంది. నా కొడుకు రిషి నాకు మెయిల్ చేశాడు లెటర్ పంపించాడు మహేంద్ర అని సంతోషపడుతూ ఉండగా జగతి నువ్వు అనవసరంగా ఎక్కువ సంతోష పడుతున్నావ్. నిన్ను రిషి ఇంటికి తన తల్లిగా పిలవలేదు. వసుధర ఇంటర్వ్యూ కోసం ధైర్యంగా ఉంటుంది అని నిన్ను పిలుస్తున్నాడు అని అనడంతో నువ్వు ఏమైనా చెప్పు మహేంద్ర ఈ సమయంలో ఇప్పుడు నేను వెళ్లకపోతే రిషి చాలా బాధపడతాడు అని అంటుంది. మహేంద్ర మతం జగతి వెళ్లడానికి ససేమిరా అంటే ఒప్పుకోడు.

Advertisement

Read Also : 

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు