Guppedantha Manasu Dec 9 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధార బాధపడుతూ ఉండగా ఇంతలోనే వసు ని అవమానించిన కాలేజీ మేడం వాళ్ళు అక్కడికి వచ్చి వసుధారకు స్వారీ చెబుతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ మనం మళ్లీమళ్లీ వసుధారను అనుకోకుండా ఉంటామా ఏంటి అని వెళ్ళిపోతారు. అప్పుడు వసుధార బాధపడుతూ ఉండగా ఇంతలో ధరణి అక్కడికి వచ్చి ఏంటి వసుధార డల్ గా ఉన్నావు అని అడగగా ఏమీ లేదు అని అబద్దం చెబుతుంది.
అప్పుడు సరే మినిస్టర్ గారు వస్తున్నారట రిషి పిలుస్తున్నాడు వెళ్దాం పద అని అనగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ధరణి వసుధార. మరొకవైపు మినిస్టర్ రావడంతో రిషి వాళ్ళు వెళ్లి రిసీవ్ చేసుకుంటారు. స్టూడెంట్స్ అందరూ వచ్చారు కదా సంతోషం అందరూ బాగా చదివి మీ రిషి సార్ పేరు తీసుకురావాలి అని అంటాడు మినిస్టర్. ఇంతలోనే అక్కడికి వసుధార రావడంతో రామ్మ వసుధార నువ్వే ఏంటి కనిపించడం లేదా అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు వసుధార డల్ గా ఉండడంతో అది రిషి గమనిస్తాడు. అప్పుడు వసుధార అన్నిట్లోనూ నువ్వే ముందు ఉంటావు కాబట్టి ఆటపాటలు అన్నీ నువ్వే చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్.
అప్పుడు రిషి ఏమైంది వసుధారఎందుకు డల్ గా ఉన్నావు అని అడగగా వెంటనే ధరణి ఆటపాటలు మొదలుపెడితే వసుధార కూడా ఆటోమేటిగ్గా ఎంజాయ్ చేస్తుంది అని అంటుంది. మరొకవైపు వరస ద్వారా ఉంటదిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు వసుధార రా కానీ నువ్వు ఇలా ఉంటే రిషి కూడా డల్ అయిపోతాడు ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని అంటాడు గౌతమ్. అందరూ కలిసి తాడు లాగే ఆట ఆడడంతో ఆ పోటీలో మగవాళ్ళు గెలుస్తారు. అప్పుడు తాడు లాగినప్పుడు వసుధార వెళ్లి రిషి ఒల్లో పడడంతో అది చూసి కాలేజీ స్టాప్ కుళ్ళుకుంటూ ఉంటారు.
తర్వాత అందరూ కలిసి భోజనం చేయడానికి వెళ్తారు. అప్పుడు అందరూ భోజనం చేస్తూ ఉండగా వసుధార మాత్రం ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా రిషి తినమని చెబుతాడు. అప్పుడు పక్కనే ఉన్న గౌతమ్ వసుధార తిను లేదంటే రిషికి అనుమానం వస్తుంది అని అంటాడు. అప్పుడు వసుధార నవ్వు తొందరగా తిను మనిద్దరం కలిసి ఒక చోటికి వెళ్దాము అని సంతోషంతో చెబుతాడు రిషి. అప్పుడు రిషి వసుధార కలిసి గతంలో వనభోజనాలు అప్పుడు వేసిన ఉయ్యాల దగ్గరికి వెళ్తారు.
అప్పుడు రిషి గతంలో జరిగిన విషయాల గురించి సంతోషంగా మాట్లాడుతూ ఉండగా వసుధార మాత్రం మౌనంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్ అక్కడికి వచ్చి వెళ్దాం పదండి రిషి వెళ్లి గౌతమ్ అని అంటాడు. ఇప్పుడు రావచ్చు కదా వచ్చి ఉయ్యాలో కూర్చో అని అనగా వసుధార రిషి ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి ఈ వసుధార కి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి.
ఆ తర్వాత ఇంటికి వెళ్లిన వసుధార జరిగిన విషయాన్ని తెలుసుకుని కుమిలిపోతూ ఉండగా జగతి ధైర్యం చెబుతుంది. ఎందుకు మేడం వాళ్ళు ఇలా మాట్లాడతారు అని అనగా లోకం తీరే ఇంత అని జగతి ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత దేవయాని మాటలు గుర్తుతెచ్చుకున్న జగతి వసుధార నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అనగా ఒకసారిగా షాక్ అవుతుంది వసుధార. నువ్వు మీ ఇంటికి వెళ్లి మీ అమ్మానాన్నలతో ధైర్యంగా జరిగింది మొత్తం చెప్పు. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను రీజన్ ఉంది వసుధార అని అంటుంది జగతి.
Read Also : Guppedantha Manasu: దేవయాని ప్లాన్ ను తిప్పికొట్టిన గౌతమ్.. సంతోషంలో వసుధార, రిషి..?