Telugu NewsLatestGuppedantha Manasu Dec 10 Today Episode : వసుధారకి ధైర్యం చెప్పిన రిషి.. సరికొత్త...

Guppedantha Manasu Dec 10 Today Episode : వసుధారకి ధైర్యం చెప్పిన రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?

Guppedantha Manasu Dec 10 Today Episode : : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార ని ఊరికి వెళ్ళిపోమని చెబుతుంది జగతి.

ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహేంద్ర కు జరిగింది మొత్తం వివరిస్తుంది. నేను వసుధారని ఊరికి వెళ్ళమని చెప్పాను మహేంద్ర అనగా వసుధర వెళితే ఎలా జగతి అని అనడంతో అప్పుడు జగతి వెళ్లి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడమని చెప్పాను. వెళ్లాలి మహేంద్ర వెళ్లి మళ్లీ తిరిగి ఈ ఇంటికి రావాలి అని అంటుంది జగతి. మనం కూడా వాళ్ళిద్దరూ కలిసి ఒకటి కావడానికి మూడుముళ్ల బంధంతో ఒకటి చేయడానికి ఏదో ఒకటి ఆలోచించాలి అని అంటుంది జగతి. అప్పుడు మహేంద్ర ఆలోచనలో పడతాడు. మరొకవైపు కాలేజీలో రిషి మీటింగ్ అరేంజ్ చేసి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటాడు.

Advertisement
Guppedantha Manasu Dec 10 Today Episode
Guppedantha Manasu Dec 10 Today Episode

ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత కాలేజీ స్టాఫ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ జగతి గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి గారిని ఇక్కడ ఎవరు అడుగుతారు ఆమె ఇస్టా రాజ్యం అంటూ జగతి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు వసుధార వింటుంది. వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి మీరు మాట్లాడుతున్నది తప్పు మేడం అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అని వాళ్ళు అనడంతో మీరు జగతి మేడం విషయంలో మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మేడం.

నేను వచ్చేసరికి మీరు జగతి మేడం గురించి మాట్లాడుతున్నారు అంటే అంతకు ముందు మీరు ఏ విధంగా మాట్లాడి ఉంటారో ఊహించగలను అని అంటుంది. అప్పుడు వెంటనే కాలేజీ స్టాప్ అదేంటి వసుధారా మేము ఏం మాట్లాడుకున్నావో తెలియకుండా మాకు సలహాలు ఇస్తున్నావా. కాలేజీ టాపర్ అయిపోయేసరికి అప్పుడే నీకు పొగరు వచ్చిందా అంటూ వసుధార గురించి అని నోటికి వచ్చిన విధంగా మాట్లాడి ఆమెను అవమానించి ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు మహేంద్ర ఫణీంద్ర, రిషి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు మహేంద్ర టాబ్లెట్స్ మింగడం మరిచిపోవడంతో రిషి టాబ్లెట్స్ ఇచ్చి టైం టు టైం టాబ్లెట్స్ మింగండి డాడ్ హెల్త్ జాగ్రత్త అని చెబుతాడు.

Advertisement

వెంటనే పనింద్ర అలా హెల్త్ గురించి మరిచిపోతే ఎలా మహేంద్ర అనటంతో నా గురించి చూసుకోవడానికి నా కొడుకు ఉన్నాడు కదా అన్నయ్య అని అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేయడానికి వెళ్తారు. మరొకవైపు వసుధార జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో అటుగా వెళుతున్న రిషి అక్కడికి వెళ్తాడు. అలా ఉన్నావు అని అనడంతో వసదానా అబద్ధాలు చెబుతూ ఈ క్లాస్ రూమ్ లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి సార్ వాటిని గుర్తు తెచ్చుకుంటున్నాను అని అనగా వెంటనే వసుధార అబద్ధం చెబుతుంది అని పసిగట్టిన రిషి నేను అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అబద్ధం చెబుతున్నావా అని అంటాడు.

అయ్యో లేదు సార్ అని అనడంతో నిజం చెప్పడం ఇష్టం లేకపోతే మానేయ్ వసుధార అని అంటాడు రిషి. అప్పుడు సర్ ఎప్పుడైనా నా ప్రవర్తనలో మీకు గర్వం కనిపించిందా, మాటతీరు తప్పుగా అనిపించిందా అని అనడంతో అసలు నీకు ఏమయింది వసుధార అని అనగా ఏమి లేదు అని అంటుంది. అప్పుడు రిషి వసుధారకి తగిన విధంగా ధైర్యం చెప్పి అక్కడ నుంచి పిలుచుకుని వెళ్లిపోతాడు. మరొకవైపు దేవయాని ఇంటికి కాలేజీ స్టాఫ్ జగతిని చూడడానికి వెళ్తారు. ఇప్పుడు దేవయాని వాళ్ళు ముందు జగతి పై తనకు చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది.

Advertisement

అప్పుడు వాళ్లు జగతి మేడంకు యాక్సిడెంట్ అయిన విషయం మాకు తెలియదు మేడం అందుకే ఇంత ఆలస్యంగా వచ్చాము అనడంతో పర్లేదు అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని వసుధార గురించి మాట్లాడగా కాలేజీ స్టాప్ వసుధార గురించి వసుధార పొగరు గురించి మాట్లాడుతూ తప్పుగా చెబుతారు. అప్పుడు దేవయాని తన మనసులో వీళ్ళు నాకు బాగా పనికొచ్చే వాళ్ళలా ఉన్నారు అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ధరణి అని పిలిచి వాళ్లకు కాఫీలు స్నాక్స్ ఇవ్వమని చెబుతుంది. తర్వాత దేవయాని వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలు అన్ని చాటుగా వింటూ ఉంటుంది.. అప్పుడు కాలేజీ స్టాఫ్ దేవయాని గురించి ఆమె మంచితనం గురించి పొగుడుతూ ఉండడంతో దేవయాని సంతోషపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ధరణి ఇటురా ఈ మేడం వాళ్ళని జగతి రూంకు పిలుచుకుని వెళ్ళు అని అంటుంది దేవయాని. వెళ్ళేటప్పుడు నన్ను ఒకసారి కలిసి వెళ్ళండి అని అంటుంది దేవయాని.

Read Also : Guppedantha Manasu Dec 9 Today Episode : బాధతో కుమిలిపోతున్న వసుధార.. వసుని తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన జగతి?

Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు