Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార చీరలో చూసిన రిషి పొగుడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధార జడలో పువ్వు పెట్టి అద్దం వైపు చూపిస్తూ అద్దంలో చూసి మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఇంతలో గౌతం రిషి రారా వెళ్దాం ఆడటంతో వస్తున్న అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత రిషి బయటకు వెళ్లడంతో గౌతమ్ నీ డ్రెస్ చాలా బాగుందిరా మరి నా డ్రెస్ ఎలా ఉంది అని అనగా నువ్వు చెప్పి నేను చెబితే బాగుండదురా అని అంటాడు రిషి. ఆ తర్వాత గౌతమ్ కంటిన్యూగా మాట్లాడుతుండడంతో వెంటనే రిషి కాసేపు మౌనంగా ఉంటావా అని అంటాడు.
ఆ తరువాత దేవయాని హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వసుధార చీర కట్టుకొని కిందికి దిగిరావడం చూసి దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు ఏంటి వసుధార కొత్త చీరనా అని అనడంతో అవును మేడమ్ చాలా బాగుంది కదా రిషి సార్ తెచ్చాడు అని అనగా దేవయాని షాక్ అవుతుంది. ఎంతైనా రిషి సార్ టేస్ట్ సూపర్ మేడం అని వసుధార తన చీరని పొగుడుతూ ఉండగా ఇక ఆపుతావా వసుధార అని దేవయాని కోపంతో అనడంతో వెంటనే రిషి వసుధర కోసం హార్న్ కొట్టగా మేడమ్ సార్ పిలుస్తున్నారు వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార.
అప్పుడు దేవయాని ఈరోజుకి వసుధార చాలా ఎక్కువ చేస్తుంది ఏదో ఒకటి చేయాలి అని కాలేజీ స్టాప్ కి ఫోన్ చేసి నేను రావడం లేదు నేను చెప్పిన పని చెప్పినట్టుగా చేయండి అని ఒక ప్లాన్ చెబుతుంది దేవయాని. మరొకవైపు పుష్ప వనభోజనాల దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న స్టాఫ్ ని మేడం వసుధర వచ్చిందా అని అడగగా వసుధార రిషి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అని తప్పుగా మాట్లాడుతారు కాలేజీ స్టాఫ్. మరొకవైపు వసుధార వంట చేస్తూ ఉండగా అక్కడికి వెళ్లి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార ని చూసి వెంటనే వంట మాస్టర్ గెటప్ వేసుకుని అక్కడికి వెళ్లి వంటలు బాగానే జరుగుతున్నాయా అనగనడంతో అవును అని వెనక్కి తిరిగి చూడగా వసుధార ఒక్కసారిగా అవుతుంది.
సార్ మీరేంటి ఇలా అనడంతో సార్ కాదు వంట మాస్టర్ అని అంటాడు రిషి. అప్పుడు సరే వంట మాస్టారు మా రిషి సార్ కి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం బాగా వుండు అనడంతో సరే అని అంటాడు. అప్పుడు వసుధార రిషి తో కలిసి ఒక ఫోటోని దిగుతుంది. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్తుండగా వసుధార జాకెట్ హుక్స్ ఊడిపోయి ఉండడం చూసి ఎలా చెప్పాలో తెలియక దాని ఫోటో తీసి వసుధారకి సెండ్ చేస్తాడు. అప్పుడు వసుధార ఇబ్బందిగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ జాకెట్ హుక్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి వసుధార కి హెల్ప్ చేస్తాడు.
అప్పుడు వసుధార సిగ్గుపడుతూ ఉండడంతో అది కాలేజీ స్టాప్ చూసి ఇంకొక మేడంని పిలుచుకొని వచ్చి జరిగింది మొత్తం వివరించి వసుధార ఇంత దిగజారిపోయింది అని తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు కావాలనే వసుధార రావడం రిషి వసుధార ల గురించి మరింత తప్పుగా మాట్లాడుకుంటారు కాలేజీ స్టాఫ్. అప్పుడు వసుధార ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలోనే గౌతమ్ అక్కడికి వచ్చి మీరు ఏం మాట్లాడుకుంటున్నారు మేడం అనడంతో మేము ఏమి మాట్లాడుకోలేదు సార్ అని అనగానేమి మొత్తం విన్నాను అలా మాట్లాడటం తప్పు మేడం అని అనగా మేము చూసిందే మాట్లాడుకున్నాము సార్ అని అంటుంది కాలేజీ స్టాప్ మేడం.
తనకు జాకెట్ హుక్స్ ఊడి పోయింది దానికి హెల్ప్ చేశాడు. అంతమాత్రానికే ఇలా తప్పుగా మాట్లాడుకుంటారా ఏ ఇలాంటివి మీ ఇండ్లలో జరగవా అని అంటాడు గౌతమ్. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా వసుధార మిమ్మల్ని ఏమనకుండా వెళ్ళిపోయింది అంటే తనకి సంస్కారం ఉంది అని అంటాడు గౌతమ్. ఇప్పుడు మీరు వెళ్లి వసుధార స్వారీ చెప్పలేదు అనుకో నేను వెళ్లి రిషికి జరిగింది మొత్తం వివరిస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు గౌతం. ఆ తర్వాత రిషి గౌతమ్ మినిస్టర్ రావడంతో ఇన్వైట్ చేయడానికి అక్కడికి వెళ్తారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World