Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని మహేంద్ర ఇద్దరూ రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర ఒకచోటి కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి ధరణి రావడంతో ఏంటమ్మా ధరణి అని అనగా చిన్న అత్తయ్య చిన్న మామయ్యకి ఎలా ఉంది మావయ్య అని అడగగా ఇందాకే మహేంద్ర ఫోన్ చేశాడమ్మా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు అనడంతో వెంటనే ధరణి సంతోషపడుతూ వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాను మామయ్య అనడంతో నేను కూడా ఎదురు చూస్తున్నాను అమ్మ అని అంటాడు. ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి మీ కంటే ఎక్కువగా నేనే ఎదురుచూస్తున్నాను అని అంటుంది. అప్పుడు ఏంటి ధరణి వాళ్ళు వస్తున్నారని చాలా ఆనందంగా ఉన్నావు.
రాగానే వెళ్లి సంబరాలు చేస్తావా అని వెటకారంగా మాట్లాడడంతో వెంటనే పనింద్ర ఏంటి దేవయాని అని అలా మాట్లాడుతున్నావ్ అని అంటాడు. మహేంద్ర వాళ్ళు ఇంటికి రాగానే నేను వాళ్ళు ఎందుకు వెళ్లారు అడిగి తెలుసుకుంటాను అని అనడంతో వెంటనే దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు దేవయాని టెన్షన్ పడుతూ వెళ్లిపోయిన వారిని మళ్లీ ఎందుకు వెళ్లారని అడగడం ఎందుకులెండి అని అనగా అలా అంటావ్ ఏంటి దేవయాని కాలేజీలో అడగాలనుకున్నాను. హాస్పిటల్ లో కూడా అడగాలనుకున్నాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత కారణం తెలుసుకుంటాను అని అంటాడు ఫణీంద్ర.
అప్పుడు దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయాక ధరణి నాకు టెన్షన్ గా ఉంది అత్తయ్య అని అనడంతో ఎందుకు ధరణి టెన్షన్ అని దేవయాని అడగగా చిన్న అత్తయ్య చిన్న మామయ్య ఇంట్లోంచి వెళ్లిపోవడానికి అసలు కారణం మీరే అని తెలిస్తే ఎలా ఉంటుందో అని అనగా దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి దాన్ని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటూ ధరణి సీరియస్ అవుతుంది దేవయాని. అప్పుడు అలా కాదు దాని అత్తా కోడలు అంటే ఎలా ఉండాలి ఇద్దరూ మంచి స్నేహితులు లాగా ఉండాలి అని అనడంతో అప్పుడు ధరణి కావాలనే దేవయానికి పిచ్చెక్కించే విధంగా మాట్లాడుతుంది.
ఏంటో ఈ ధరణి నాకు ఎప్పటికీ అర్థం కాదు మంచిదో పిచ్చిదో నాకేంది అర్థం కావడం లేదు అనుకుంటూ ఉంటుంది దేవయాని. మరొకవైపు వసుధార జగతికి సేవలు చేస్తూ ఉంటుంది. జ్యూస్ తాగండి మేడం పండు తినండి మీరు బాగా కోలుకుంటారు అని అంటుంది. అప్పుడు జగతి కాస్త ఎమోషనల్ గా మాట్లాడగా ఆ మాటలు వసుధారకి అర్థం కాకపోవడంతో మేడం ఈ మధ్యకాలంలో మీ మాటలు నాకు ఏమీ అర్థం కావడం లేదు అని అంటుంది. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగా నా దగ్గర కొన్ని ప్రశ్నలకు సమాధానం లేదు వసు అని అంటుంది.
మీరు ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారు అని మేము ఎంత బాధపడ్డామో మేడం అని అనగా, నువ్వు నీ సైడ్ నుంచి మాత్రమే ఆలోచిస్తున్నావు వసుధార మేము మీ కంటే అక్కడ రెండింతలు బాధపడ్డాము అని అంటుంది జగతి. మేము అక్కడ ఎంత బాధపడి ఉంటామో నీకేం తెలుసు అని అంటుంది. మేడం మీరు ఇంట్లోంచి వెళ్లిపోవడానికి నేను కూడా కారణమా అని అనగా చెప్పాను కదా వసుధార నేనేమి చెప్పలేను నన్ను ఏమీ అడగకు అని అంటుంది. ఆ తరువాత జగతి మెయిల్ చేశారు అనడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. నిజమా మేడం నాకు ఈ గుడ్ న్యూస్ రిషి చెప్పలేదు చాలా సంతోషంగా ఉంది మేడం అంటూ వసుధర సంతోష పడుతూ ఉంటుంది.
నాకోసం మిమ్మల్ని రమ్మని చెప్పి సార్ పిలిచాడా నాకు చాలా సంతోషంగా ఉంది మేడం అని వసు సంతోష పడుతుండడంతో జగతి కూడా సంతోషపడుతుంది. ఇంతలో వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రిషి మహేంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు మహేంద్ర జగతి మనం డిశ్చార్జ్ ఇంటికి వెళ్లవచ్చు అని అనగా వెంటనే రిషి మేడం మీ కోసం ఇంట్లో ఒక నర్సుని కూడా ఏర్పాటు చేసుకుందాం అని అంటాడు. అప్పుడు మహేంద్ర అమ్మ వసు లగేజ్ మొత్తం సర్దు అని అనగా ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. రిషి డిశ్చార్జ్ కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయ్యాయి అని అంటాడు గౌతమ్. మరి బిల్ కట్టావా అని అనగా లేదు అని అంటాడు గౌతమ్.
ఇప్పుడు మహేంద్ర తన కార్డుతో కట్టమని ఇస్తుండగా వద్దు మీరు ఆగండి అని చెప్పే రిషి తన కార్డుతో బిల్ పే చేయమని చెప్పి గౌతమ్ కి కార్డు ఇస్తాడు. దాంతో జగతి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార రిషివైపు ప్రేమగా చూస్తూ ఈ జెంటిల్మెన్ ని ఎప్పటికీ వదులుకోకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు జగతి రిషి వసుదారలు ఇద్దరు కలిసిపోయారు అదే చాలు వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అనుకుంటూ ఉంటుంది.