Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి మహేంద్ర ఇద్దరూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర నేను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో రిషి అని చెబుతుండగా మీరేం చెప్పకండి డాడీ మీరు ఎక్కడికి వెళ్లారు ఈ ప్రశ్నలన్నీ కూడా నేను అడగను మీరు తిరిగి వచ్చారు నాకు అది చాలు ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకండి అని అనడంతో వెంటనే మహేంద్ర రిషిని గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అవుతాడు. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని దంపతులు వస్తారు. అప్పుడు వాళ్లు మహేంద్ర ను మాట్లాడిస్తారు. ఆ తర్వాత డాక్టర్ జగతి కండిషన్ బాగానే ఉంది ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెబుతాడు.
మరొకవైపు జగతి దగ్గరికి వెళ్లిన మహేంద్ర రిషి నీకు బ్లడ్ ఇచ్చాడు జగతి అని చెప్పడంతో సంతోష పడుతూ ఉంటుంది జగతి. నా కొడుకు నాకు బ్లడ్ ఇచ్చాడా మహేంద్ర అని ఆనందపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. అప్పుడు దేవయాని ఏంటి జగతి ఈ యాక్సిడెంట్ ని కూడా నీకు అనుకూలంగా మలుచుకున్నావా అనడంతో వెంటనే కోప్పడిన వసుధార మేడం మర్యాదగా మాట్లాడండి. మేడంకి ఇప్పుడే వచ్చింది ఆ విషయం మీకు తెలుసా అనడంతో తెలుసులే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. అప్పుడు మహేంద్ర దేవయానిపై సీరియస్ అవుతూ వదినగారు మీరు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు ఇది హాస్పిటల్ మర్యాదగా మాట్లాడండి అని అంటాడు.
జగతి చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అలాంటప్పుడు మీరు ఇలాగేనా మాట్లాడేది అని అంటాడు. ఇప్పుడు జగతి మౌనంగా ఉండమని చెప్పడంతో వెంటనే దేవయాని రిషి కి ఏవో మాయమాటలు చెప్పి బ్లడ్ ఇప్పించుకోగానే మీ అధీనంలోకి వచ్చాడని అనుకుంటున్నారా అంటూ మాట్లాడడంతో వదిన గారు మీరు ఇంత చీప్ గా మాట్లాడతారని అనుకోలేదు అని అనగా ఇంతలో నర్స్ వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పడంతో ఈవిడని పంపించండి సిస్టర్ అని అంటాడు మహేంద్ర.
అప్పుడు దేవయాని అక్కడి నుంచి వెళ్తుండగా రిషి రావడం చూసి వసుధార జగతిని జాగ్రత్తగా చూసుకో జగతిని ఆరోగ్యం జాగ్రత్త అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది. ఆ తర్వాత జగతి తన కొడుకు వైపు ఎమోషనల్ గా చూస్తుంది. మరొకవైపు వసుధార రిషి కోసం టిఫిన్ తీసుకొని రావడానికి వెళుతుంది. అప్పుడు రిషి అక్కడికి రావడంతో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగా మీకోసమే వచ్చాను సార్ అని అంటుంది. ఇప్పుడు నేను నిన్ను అడిగానా అని అనగా మీరేం మాట్లాడకండి సార్ అంటూ రిషికి ఇడ్లీ తినిపిస్తుంది. ఇంతలోనే గౌతమ్ ఫోన్ చేసి డిశ్చార్జ్ అయ్యారు అని చెప్పడంతో వస్తున్నాము అంటూ రిషి వసుధార ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్తారు.
అప్పుడు వసుధార రిషి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఫోన్ రావడంతో రిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గౌతమ్ దగ్గరికి వెళ్లి రేయ్ నువ్వు అసలు నా ఫ్రెండ్ వేనా మా డాడ్ కోసం నేను ఇంతలా తాపత్రయ పడుతుంటే నా దగ్గర నిజం దాచి సినిమా చూస్తావా నువ్వు అసలు ఫ్రెండువేనా అని కోప్పడతాడు రిషి. అప్పుడు గౌతమ్ నేను ఒకసారి చెప్పేది వినురా వినురా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు రిషి బుజం మీద చేయి వేయడంతో ఏమి వినాలి రా ఏం ఆలోచిస్తున్నావు అని అనగా ఇదంతా నా భ్రమణా అనుకొని గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరొకవైపు జగతి దంపతులు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జగతి నాకేం కాలేదు మహేంద్ర నువ్వు రిషి ని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది.