Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్ దీప ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్, దీప బ్లడ్ రిపోర్ట్స్ చూసి గతంలో దీపకు వచ్చిన జబ్బు మళ్ళీ వచ్చింది. దీపకు ఇప్పుడు చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని దీపకు ఎలా చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్తాడు. దీప పడుకుని ఉండగా అక్కడికి వెళ్లి మౌనంగా కూర్చుంటాడు. అప్పుడు దీప వెళ్లిన పని ఏమైంది అని అనగా ఆ విషయం గురించి తర్వాత చెప్తాను మనం ముందు హాస్పిటల్ కి వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు వెంటనే దీప ఏమైంది డాక్టర్ బాబు అని అనగా నీకోసమే దీప అని అనడంతో నేను ఇంతకుముందే చెప్పాను కదా డాక్టర్ బాబు నా కూతుర్ని వెతికి ఎంతవరకు నేను ఎక్కడికి రాను అని అంటుంది.
సరే మీరు ఇక్కడే కూర్చొని నేను వెళ్లి వంట చేసి తీసుకొస్తాను అని అనగా వెంటనే కార్తీక్ సీరియస్ అవుతాడు. నీకు పొగ పడదు అని చెప్పాను కదా మళ్లీ ఎందుకు పదేపదే అలాగే చేస్తావు అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఇప్పటికైనా నీకు నిజం చెప్పకపోతే ట్రీట్మెంట్ చేయించుకోవు నన్ను క్షమించే దీపా నాకు గతం గుర్తుకు వచ్చి చాలా రోజులు అయింది అని అసలు విషయం చెప్పేస్తాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ వెనక్కి తిరిగి చూడగా దీప కళ్ళు తిరిగి పడిపోయి ఉండడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ మీరు ఒక డాక్టర్ ఏ కదా మరి ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు అనడంతో మాది హైదరాబాద్ అయితే అనుకోని పరిస్థితులలో ఇక్కడ ఉంటున్నాము.
తనకు వెంటనే సర్జరీ చేయాలి అని కార్తీక్ అనగా మీరే చేయండి అని అంటాడు ఆ డాక్టర్. అప్పుడు కార్తీక్ సరే ఆపరేషన్ కు అన్ని సిద్ధం చేయండి అని అంటాడు. మరొకవైపు ఆనంద్ రావుకి సౌందర్య ఫోన్ చేసి దీప కార్తీక్ లు బతికే ఉన్నారు అని చెప్పడంతో వెంటనే ఆనంద్ రావు సంతోషపడుతూ సరే సౌందర్య మేము కూడా అక్కడికి వస్తాము అని అంటాడు. అప్పుడు బెడ్ పై దీప పడుకుని ఉండగా కార్తీక్ బాధపడుతూ ఉండడంతో ఇంతలోనే దీప కు మేలుకో వస్తుంది. నాకు ఏమైంది డాక్టర్ బాబు నేను ఎక్కడ ఉన్నాను అని అడగగా నీకు ఏం కాలేదు దీప చిన్న ఆపరేషన్ చేయాలి అని అనగా ఆపరేషన్ నాకు వద్దు నేను నా కూతుర్ని వెతకడానికి వెళ్లాలి అని వంటలక్క బయటకి వెళుతుండగా మళ్లీ తిరిగి కిందపడిపోతుంది.
అప్పుడు దీప తన బాధల గురించి తన కూతురు గురించి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మరొకవైపు మోనిత కార్తీక్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలోనే శివకు ఫోన్ చేయగా శివ అక్కడికి వస్తాడు. నేను నీకు ఏం చెప్పాను రా నువ్వు ఏం చేస్తున్నావు అనడంతో మేడం మీరు చెప్పిన విధంగానే మొత్తం సంగారెడ్డి వెతికాను అక్కడ ఎవరూ లేరు అని అంటాడు. అప్పుడు శివ మనసులో నాకు శివలత చెప్పింది ఆ వంటలక్క డాక్టర్ బాబు ఇద్దు భార్యాభర్తలు వారిని విడదీసి నేను ఆ పాపం చేయలేను అందుకే మీకు అబద్ధం చెబుతున్నాను అని అనుకుంటాడు శివ. మరొకవైపు ఆనంద్ రావు హిమ సౌందర్య దగ్గరకు వస్తారు.
అప్పుడు ఆనంద్ రావు పద సౌందర్య వెళ్లి నా కొడుకు కోడలిని చూద్దాం అని అనగా ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తారు రేపు ఉదయాన్నే వెళ్దాము అని అనడంతో సరే అని అంటాడు. మరొకవైపు దీప సౌర్య ఫోటో చూసి బాధపడుతూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. అప్పుడు కార్తీక్ నీకు ఎన్నిసార్లు చెప్పాను దీప ఎక్కువగా ఆలోచించొద్దు అని ఈ విషయాల గురించి ఆలోచించకు నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు వంటలక్క సరే డాక్టర్ బాబు శౌర్య ఆచూకీ తొందరగా తెలుసుకోండి అని అంటుంది.