...

Guppedantha Manasu Nov 30 Today Episode : దేవయానికి చుక్కలు చూపిస్తున్న ధరణి.. జగతితో ఎమోషనల్ గా మాట్లాడిన రిషి.?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జగతి వాళ్ళు కారులో వస్తూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర వాళ్ళు డిశ్చార్జ్ ఇంటికి వెళ్తుండగా జగతి, రిషి వసు ని చూసి ముచ్చట పడుతూ సంతోషిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసిపోయారు. వసు మనసు రిషికి తెలుసు రిషి మనసు వసుధారకి తెలుసు వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది జగతి. అప్పుడు అందరూ అక్కడే ఉండగా మహేంద్ర తో మాట్లాడటం ఇబ్బందిగా అనిపించడంతో మహేంద్రకు మెసేజ్ చేస్తుంది జగతి. అప్పుడు మహేంద్ర సెల్ ఫోన్ రిషి దగ్గర ఉండడంతో రిషి ఆ మెసేజ్ చదివి డిలీట్ చేస్తాడు. అప్పుడు మహేంద్ర నీ ఫోన్ తీసుకో అని జగతి చెప్పడంతో వెంటనే రిషి డాడ్ ఇదిగోండి మీ ఫోన్ అని ఇస్తాడు.

ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. రిషి, మహేంద్రను పిలుచుకుని వస్తుండగా జగతి ఒక్కతే నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు గుమ్మానికి ఎదురుగా దేవయాని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు జగతి కిందపడిపోతుండగా రిషి వెళ్లి మేడం అని పట్టుకుంటాడు. అది చూసిన దేవయాని మరింత కోపంతో రగిలిపోతుంది. జగతి తన కొడుకు రిషి ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు జగతి వాళ్ళని చూసిన దేవయాని కుళ్ళుకుంటూ ఈ జగతిని నేను ఏమీ చేయలేనా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే వాళ్ళు లోపలికి వెళుతుండగా ధరణి హారతి తీసుకుని వస్తుంది.

అప్పుడు దేవయాని ధరణి ఇవన్నీ అవసరమా అంటుండగా పెద్దమ్మ ఏం కాదులే అని అనడంతో దేవయాని మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు ధరణి హారతిస్తూ కావాలనే దేవయానిని ఉద్దేశిస్తూ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఇస్తే ఏ చెడ్డ కళ్ళు పడ్డాయో అంటూ హారతిస్తుండగా ఆ మాటలు విన్న దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు జగతి మహేంద్రలు నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్లడంతో అప్పుడు రిషి మేడం నేను డాడ్ పైన రూమ్లో పడుకుంటాము మీరు ఇక్కడే నా రూమ్ లో ఉండండి వసుధర మేడమ్ ని లోపటికి తీసుకెళ్ళు అని అంటాడు రిషి.

ఆ తర్వాత దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉండగా కావాలనే ధరణి అక్కడికి వెళ్లి అత్తయ్య గారు ఏం వంట చేయమంటారు అనడంతో నేను మెసేజ్ చేస్తాను లేదంటే ఫోన్ చేస్తాను వెళ్ళు ధరణి అని అంటుంది. ఆ తర్వాత ధరణి వంట చేస్తూ ఉండగా దేవయాని అక్కడికి వెళ్లి ధరణి అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావ్ ధరణి ఇంట్లో నేనొక పెద్ద దాన్ని ఉన్నానని తెలియకుండా నీకు ఏది అనిపిస్తే అది చేస్తావా నిన్ను ఎర్రనిల్లు ఎవరు తీసుకొని రమ్మన్నారు అని కోప్పడుతుంది దేవయాని. అత్తయ్య గారు అది పెద్ద మావయ్య దిష్టి తీయమని చెప్పారు అత్తయ్య గారు అని అంటుంది.

అయినా నాకు ఒక మాట చెప్పాలి కదా అని అంటుంది దేవయాని. ఇంతలో అక్కడికి ఫణింద్ర రావడంతో పెద్దమామయ్య అని పిలవగా అక్కడికి ఫణింద్ర వచ్చి ఏమైంది ధరణి అని అనడంతో ఏం లేదు అంటూ కవర్ చేసి దేవయాని అక్కడి నుంచి పంపించేస్తుంది. మరొకవైపు వసు జగతికి సేవలు చేస్తూ ఉండగా అప్పుడు జగతి ఇవన్నీ ఎందుకు వసుధార అని అంటుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వచ్చి మేడంకి జ్యూస్ తీసుకుని రా వసుధార అని వసుధార ని అక్కడ నుంచి పంపిస్తాడు.

అప్పుడు జగతితో రిషి మాట్లాడుతూ మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు చాలా బాధపడ్డాను మేడం అలాగే మీరు రోడ్ యాక్సిడెంట్లో చిన్న ప్రమాదంతో బయటపడ్డారు అదే ఆ యాక్సిడెంట్లో డాడ్ కి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే అప్పుడు మీరు నేను ఎంత బాధ పడే వాళ్ళం. డాడ్ కి ఏమైనా తట్టుకోగలమా అని అంటాడు రిషి. అప్పుడు జగతి ఏం మాట్లాడకుండా రిషి మాట్లాడే మాటలు వింటూ ఉంటుంది. మీరు కార్లో వస్తున్నప్పుడు మెసేజ్ చేశారు అటువంటి మెసేజ్ డాడ్ చదివితే బాధపడతారు అందుకే డిలీట్ చేశాను మేడం అని అంటాడు రిషి. బంధం గురించి మెసేజ్ పెట్టడం కాదు మేడం అని జగతితో మాట్లాడుతూ ఉంటాడు రిషి.