Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దాదాపు దశాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఎన్నో కీలక మలుపులు మరియు ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది. ఈ కార్యక్రమం ప్రారంభం సమయంలో జడ్జీలుగా రోజా మరియు మెగా బ్రదర్ నాగబాబు వ్యవహరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజా జడ్జ్ గా కొనసాగుతుంది. కానీ మధ్యలో నాగబాబు వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో పలువురు వచ్చి వెళ్లారు.. చివరకు సింగర్ మనో సెటిల్ అయ్యాడు అనుకుంటున్న సమయంలో ఇప్పుడు జడ్జి రోజా తన సీటు ని వదిలేయాల్సి వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు అనూహ్యంగా మంత్రి పదవి కట్టబెట్టడం తో అదృష్టం కలిసి వచ్చి ఏపీ క్యాబినెట్ లో చోటు సొంతం చేసుకుంది.
రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు ఆమె మంత్రిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రిగా ఆమె జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించదు అని క్లారిటీ వచ్చేసింది. ఆమె లేకపోవడంతో జబర్దస్త్ కార్యక్రమం ఎటు వైపు వెళుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది కమెడియన్స్ వెళ్ళిపోయినా.. ఎంతో మంది పోటీగా వచ్చిన జబర్దస్త్ కార్యక్రమం నిలిచి సత్తా చాటింది. ఇప్పుడు రోజా పోయినా కూడా కచ్చితంగా నిలిచి సత్తా చాటుతోంది అంటూ కొందరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం రోజా లేకపోవడంతో జబర్దస్త్ మెల్ల మెల్లగా డౌన్ ఫాల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.
అందుకు కారణాలు కూడా వారు చెబుతున్నారు. రోజా అనే ఒక ఫైర్ బ్రాండ్ వల్ల చాలా మంది భయంతో జబర్దస్త్ లో కొనసాగుతూ ఉంటారు. కానీ ఈ రోజు లేకపోవడం వల్ల కచ్చితంగా ఎవరి ఇష్టం వారిది అన్నట్లుగా వ్యవహరిస్తూ విచ్చల విడిగా ప్రవర్తించడంతో కార్యక్రమం కాస్త అదుపు తప్పి అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే జబర్దస్త్ ని కాపాడడం ఎవరి తరం కాదంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఈ టీవీ జబర్దస్త్ కార్యక్రమానికి తెలుగు ప్రేక్షకులకు తీరని లోటు ఏర్పడిందని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది.
Read Also : Minister RK Roja : ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి.. జబర్దస్త్ షో, సినిమాలకు గుడ్‌బై..!