Katrina kaif : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన వివాహ బంధంలో మునిగి తేలుతున్నారు. కొంచెం గ్యాప్ దొరికిన తన భర్త విక్కీ కౌశల్ తో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. అంతే కాకుండా ఆ విషయాలపై ఎప్పటికప్పుడు అభిమానులకు అప్ డేట్లు ఇస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఎయిర్ పోర్టులో కనిపించిన ఫొటోలు చూసిన వారంతా ఆమె ప్రెగ్నంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లతో కత్రినా కైఫ్ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై మాత్రం క్రత్రినా కానీ విక్కీ కౌశల్ కానీ నోరు విప్పలేదు. వారు నోరు విప్పితేనే… నిజమేదో తెలుస్తుంది.

అయితే హీరోయిన్ కత్రినా కైఫ్, తన సహ నటుడు విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏ విషయమైనా ఈజీగా బయటికి వచ్చే బాలీవుడ్‌లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి మాత్రం ఇంకెవరికీ తెలియలేదు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. పెళ్లి అయినప్పటి నుంచి.. వీరి పర్సనల్ లైఫ్‌లోని చిన్న చిన్న ఆనందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కపుల్ గోల్స్‌ను సెట్ చేస్తున్నారు.