Jabardasth Immanuel : జబర్దస్త్ షోల్ లవ్ ట్రాక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రష్మీ, సుధీర్ జంట బుల్లితెరపై ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. వీరిద్దరిదీ నిజమైన ప్రేమ కాదని తెలినప్పటికీ ఒకే ప్రేములో చూస్తే… అభిమానులకు పండగలా ఉండేది. రష్మీ, సుధీర్ పెళ్లి చేస్కోవాలని ఎంతో మంది కామెంట్లు రూపంలో తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఆ తర్వాత ఎక్కవగా ఫేమస్ అయిన జంట వర్ష-అమ్మాన్యుయేల్. అవకాశం దొరికినప్పుడల్లా వీరిద్దరి లవ్ ట్రాక్ ను మల్లెమాల నిర్వాహకులు ప్రోమోలో చూపిస్తూ హైప్ క్రియేట్ చేసేవారు. అయితే కాదాగా విడుదలైన స్కిట్ లో అమ్మాన్యుయేల్ – వర్ష జంట పంచ్ లు బాగా పేలాయి. ముఖ్యంగా ఇమ్మాన్యుయెల్ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు వర్షను వాడుకుని మంచి పొజిషన్ కు వచ్చావయ్యా.. అని గెటప్ శ్రీను అనగా… ఊరుకోండి సార్ అంటూ ఇమ్మాన్యుయెల్ న్నాడు.
దాన్ని నేను వాడుకోవడం ఏంటి సార్.. నా ఫేమ్ ను వాడుకునే దానికి ఫేమ్ వచ్చిందని తెిపాడు. మేం లవర్స్ కాదు.. ఆ ఆడియో వాళ్లు ఓ ట్రాక్ వేస్తారు. చిన్నగా దగ్గరకు వెళ్తాం.. ఇలాగే ట్రాకులు వేసి నా కొంపంతా ముంచారంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు ఇమ్మాన్యుయెల్. ఇక్కడ స్కిట్ అవ్వగానే ఇంటికెళ్లి నా నంబర్ బ్లాక్ లో పెడ్తుంది. ఏ ఈవెంట్ కు వెళ్లినా అన్నా, వదిన ఎక్కడ అని అడుగుతున్నారు.. వర్ష ఎక్కడుంటుందో నాకేం తెల్సంటూకామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అయింది.