Jabardasth faima : బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి వారం నామినేషన్స్ లో భాగంగా సింగర్ రేవంత్ తర్వాత జబర్దస్త్ ఫైమాకే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పవచ్చు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మొదటి వారంలోనే నామినేషన్స్ రౌండ్ పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతేకాదండోయ్ నామినేషన్స్ లో అందరూ టాప్ సెలబ్రిటీలు ఉండటం అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నామినేషన్స్ మొదలయ్యాయో లేదో అలా ఓటింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే అనూహ్యంగా నామినేట్ అయిన ఏడుగురు సభ్యుల్లో ఫైమాకే ఎక్కువ ఓటింగ్ ఉందని సమాచారం.
పటాస్, జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఓకే చెప్పేసింది. ఇక హౌస్ లో కూడా అందరినీ ఎంటర్ టైన్ చేసేందుకు తెగ కష్టపడుతోంది. ఆమె చేససే కామెడీ వల్ల కొంతమంది హర్ట్ అవుతున్నారని సమాచారం. ఇకపోతే నామినేషన్స్ లో ఉన్న ఫైమా ఓటింగ్ పర్సంటేజీలో మొదటి రెండు స్థానాల్లో ఉందట. మొదటి వారం ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదని చాలా మంది చెబుతున్నారు. మరి ఏం జరగనుందో రానురాను చూడాలి.
Read Also : Neha Chowdary: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మల్టీ టాలెంటెడ్ నేహా చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?