Captain Movie Review : తమిళ్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఒక వింత జీవితో కలిసి అతని బృందంతో పోరాటం చేయటమే ఈ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత హాలీవుడ్ సినిమా ప్రెడేటర్ లా ఉందని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రెడేటర్ సినిమాతో ఈ సినిమా స్టోరీకి సంబంధం లేదని, ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆర్య వెల్లడించాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమాని చూస్తే కచ్చితంగా ఇది ప్రెడేటర్ సినిమా నుండి తీసుకున్న కథ లాగా అనిపిస్తుంది.
కథ
ఈ సినిమాలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ రోల్ కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) ఆధ్వర్యంలో ఓ స్పెషల్ టీమ్ రన్ ప్రత్యేకమైన ప్రాజెక్టులు చేపడుతూంటుంది. తన దగ్గర ఉన్న టీమ్ తో ఎలాంటి సమస్యలు అయినా పరిష్కరించగలగుతారు. ఈ క్రమంలో చాలా సంవత్సరాలగా పౌర కార్యకలాపాలు లేని భారతదేశంలోని ఈశాన్య అటవీ ప్రాంతంలో ఉన్న రహస్యాన్ని చేదించడానికి ఆర్య అండ్ టీం వెళ్తుంది. ప్రతీ సారి తన సాహసాలతో సమయస్పూర్తితో సమస్యలను ఈజీగా డీల్ చేసే విజయ్ కుమార్ కు అక్కడ పరిస్దితులు ఓ పట్టాన లొంగవు. ఎందుకంటె అక్కడ ఉన్నది మనుషులు కాదు వింత మృగాలు ఆని తెలుసుకున్నాడు.
Captain Movie Review : కెప్టెన్ మూవీ రివ్యూ..
మొత్తానికి ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయం ఎలా ఉందంటే ఈ సినిమాలో కథ,కథనం లేకపోవటంతో ప్రేక్షకులు బాగా నిరాశపడ్డారు. ఈ సినిమాలో చెప్పుకోతగ్గ విషయం ఏమైనా ఉందంటే వీఎఫ్ఎక్స్ వర్క్స్ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో VFX అంతగా కుదరలేదని క్లియర్ గా కనిపిస్తోంది. దానికి తోడు ఈ సినిమాలోడైరక్టర్ తన దృష్టిని కథ మీద కాకుండా మిగతా విషయాల మీద పెట్టాడు. ఎందుకంటే ఈ సృష్టిలో లేని ఒక విందు జంతువుని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇక ఈ సినిమాలో రొటీన్ సీన్స్ ఎక్కువ శాతం ఆక్రమించాయి. సైన్స్ ఫిక్షన్ కదా ఎవరు పట్టించుకోరని భావించారేమో కొన్ని కొన్ని లాజిక్స్ వదిలేశారు. ఓవరాల్ సినిమా ప్రేక్షకులను బాగా నిరాశపరిచింది.
కెప్టెన్ రేటింగ్: 2/5
Read Also : Ranga Ranga vaibhavanga: వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమా ట్విట్టర్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?
Tufan9 Telugu News And Updates Breaking News All over World