Inaya Sultana : ప్రస్తుత కాలంలో చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వీరిలో కొంతమంది మాత్రమే సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో ఇనయ సుల్తానా కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఇనయా సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించినప్పటికీ అంత గుర్తింపు పొందలేకపోయింది. కానీ సంచలన దర్శకుడు ఆర్జీవితో తన బర్త్డే రోజున చేసిన డాన్స్ వీడియో బయటికి రావటంతో ఓవర్ నైట్ లో ఇనయ పాపులర్ అయ్యింది.
Inaya Sultana
ఆ వీడియో వైరల్ కావడంతో ప్రేక్షకులు ఈమె గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. ఇలా పాపులర్ అయిన ఇనయ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలో ఇనయా పాపులారిటీ మరింత పెరిగింది. దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇనయా ఆర్జీవితో చేసిన డాన్స్ వీడియో గురించి స్పందించింది.
Inaya Sultana : ఆర్జీవీతో డాన్స్ వీడియో పై స్పందించిన ఇనయ సుల్తానా..!
ఈ మేరకు ఇనయ మాట్లాడుతూ.. ” ఆర్జీవితో డాన్స్ చేసిన వీడియో బయటకి రావడంతో తన స్నేహితులు, కుటుంబ సభ్యులు తనని అసహ్యించుకున్నారని ఆమె వెల్లడించింది. అప్పటినుండి తన కుటుంబ సభ్యులతో తనకి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఆమె బాధను వ్యక్తం చేసింది. నేనేం పోర్న్ వీడియోలు చేయడం లేదు కదా.. కేవలం సినిమాలలో మాత్రమే నటిస్తున్నాను ” అంటూ తన బాధ వెల్లడించింది. ఈ క్రమంలో తన తల్లికి కూడా క్షమాపణలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also : Bigg Boss6: బిగ్ బాస్ లో ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్లు వీళ్లే?