Hyper aadi: బిగ్ బాస్ షోని మరింత రక్తి కట్టిస్తూ.. ఎక్కువ వ్యూస్ పొందేలా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే సెలబ్రిటీలందరినీ ఒకే చోట చేసే అవకాశంతో పాటు వారి వారి ఆట, పాట ఎంజాయ్ మూమెంట్స్ అన్నీ బుల్లితెర ఆడియన్స్ ముందు ఉంచుతన్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ షోతో ఫుల్ పాపులర్ అయిన కొందరిని ఈ షోలో భాగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో కానీ బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందులో భాగంగానే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందని తెలుస్తోంది.
అయితే ఈ కంటెస్టెంట్స్ విషయంలో వినిపిస్తున్న కొన్ని పేర్లు షో పట్ల ఆసక్తి రేపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం హైపర్ ఆది, యాంకర్ వర్ణిణీ, నవ్యా స్వామి, దీపికా పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్ లను ఫైనల్ చేశారని సమాచారం. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు వీళ్లతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. అయితే ఇదే నిజమైన లిస్టా లేదా ఇందులో ఎవరైనా రాకుండా ఉంటారా అనేది తెలియాలంటే మాత్రం ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.