...

Inaya vs Srihan: ‘పిట్ట’ కూతల మాటలకు నామినేషన్ దెబ్బ

Inaya vs Srihan: నాలుగో వారం బిగ్ బాస్ నామినేషన్స్ హాట్ హాట్ గా జరిగాయి. ఆర్జీవీ హాట్ బ్యూటీ ఇనయ మరోసారి అందరికీ టార్గెట్ అయింది. తను ఏమీ అనకపోయినా తనను పిట్ట కూతలు అన్న శ్రీహాన్ మరోసారి నోరు పారేసుకున్నాడు. అయితే ఏమీ అనని ఇనయకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి.. సింగర్ రేవంత్, గీతు, శ్రీహాన్ ఇనయను హేళన చేశారు. వీళ్ల ముగ్గురికి నాగార్జున చేతిలో గట్టిగానే చివాట్లు పడ్డాయి. తనకు సంబంధమే.. లేని అంశాల్లోకి వెళ్లి తన నోటి దురుసుతనం చూపిస్తున్న గీతూపై నాగార్జున సీరియస్ అయ్యాడు. కొద్దిగా నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని చివాట్లు పెట్టాడు. అలాగే వాడు అన్నందుకు శ్రీహాన్ కు కోపం పొడుచుకు వచ్చిందని.. మరి ఇనయను పిట్ట అన్నప్పుడు ఏమైందని గడ్డి పెట్టాడు. ఇక వాళ్లిద్దరూ గొడవ పడుతుంటే మధ్యలోకి వెళ్లిన రేవంత్ ను సైతం నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు.

ఇక నామినేషన్స్ లో ఇనయ, శ్రీహాన్ మధ్య మరోసారి పిట్ట వివాదం రేగింది. అప్పటికే నాగార్జున తో క్లాస్ పీకించుకన్న శ్రీహాన్.. తన ధోరణి ఏమాత్రం మార్చుకోకుండా.. మళ్లీ అదే తలా.. తోకా లేని రీజన్స్ చెప్పి ఇనయను నామినేట్ చేశాడు. ఇక తిరిగి ఇనయ తనను నామినేట్ చేసే సమయంలో ఎప్పట్లాగే శ్రీహాన్ ఓవరాక్షన్ చేశాడు. ఇక రోత బ్యాచ్ ఉండనే ఉంది. గీతు, ఆరోహి, పింకీ అంతా కలిసి ఇనయను నామినేట్ చేశారు. ఇప్పుడు కంటెస్టెంట్స్ అంతా ఇనయకు వ్యతిరేకంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.