Inaya Srihan Fight: ఇనయ, శ్రీహాన్ ల మధ్య గొడవ, నువ్ మగాడివేనా అంటూ కామెంట్లు!

Inaya Srihan Fight: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులలో సాగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు అలకలు, ముప్పై గొడవలు అన్నట్లుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో శ్రీహాన్, గీతు, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. అయితే వీరికి బ్రిగ్స్ టాస్క్ ఇవ్వగా… ఇందులో గీతూ ముందే చేతులెత్తేసింది. ఆ తర్వాత ఫైమా విషయంలో పెద్ద రచ్చే జరిగింది. బ్రిగ్స్ ని కాపాడుకునే ప్రయత్నంలో ఫైమా చేతులు బ్రిగ్స్ కి తగలడంతో…. రేవంత్ ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు. ఫైమా కెప్టెన్ కావాలని గట్టిగా పోరాడిన ఇనయ దీన్ని వ్యతిరేకించింది. శ్రీహాన్ కూడా బ్రిగ్స్ కి టచ్ అయ్యాడు.. మరి అతడిని ఎందుకు డిస్ క్వాలిఫై చేయలేదని నిలదీసింది.

దీంతో వీరిద్దరి మధ్య గొడవ ప్రారంభం అయింది. ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా పట్టించుకోకుండా.. సంచాలక్ గా నిర్ణయం తీసుకో అంటూ శ్రీహాన్ చెప్పగా ఇనయ పైర్ అయింది. ఏయ్ నన్ను పట్టుకొని పిట్ట అని ఎలా అంటావ్ అంటూ శ్రీహాన్ పై ఫైర్ అయింది. నన్ను పిట్ట అని ఎలా అంటావ్ అంటూ అరవగా.. శ్రీహాన్ కూడా గొడవకు దగాడు. ఏయ్ అంటూ వేలు చూపిస్తూ ఇనయ మీదకు దూసుకెళ్లిపోయాడు. మధ్యలో వచ్చిన గీతు.. నిన్న కాదు పిట్ట అన్నది అంటూ రెచ్చిపోయింది. పాపం ఇనయ తప్పేం లేకపోయినా అందరి కోపానికి గురైంది.