Geetu Royal : బిగ్ బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయిన గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర షోతో పాటు జబర్దస్త్ వేదికపై కూడా మెరిసింది. అంతేనా ఇప్పుడు బిగ్ బాస్ 6లోనూ పాల్గొనబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా గీతూ రాయల్ కన్నీళ్లు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి తనను బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ వలవలా ఏడ్చేసింది. అయితే అందరూ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని చెప్పినప్పటికీ తాను వినలేదని.. చాలా వరకు బాడీ మొత్తం కవర్ అయ్యేలా బట్టలు వేస్కునే దాన్ని అని వివరించింది.
కానీ తనేమో పిచ్చి దానిలా ఏడుస్తూనే ఉన్నానంటూ వివరించారు. ఇకనైనా అంతా మారండి.. బాడీ షేమింగ్ చేయొద్దంటూ ఏడ్చేసింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది. నువ్వు గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ ను బాడీ షేమింగ్ చేయలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై ఆమె స్పందిస్తూ బిగ్ బాస్ గేమ్ జడ్జ్ చేయడమే నా పని. మా వాడిని అన్నప్పుడు లేదా ని తిడుతున్నారు. ఆయన బయటకు వచ్చినప్పుడు నేను అతడి పేరు కూడా ఎత్తలేదు. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేనేదో కావాలని సింపతీ క్రియేట్ చేస్తున్నానంటున్నారని.. నాకేమీ చేతకాదని అని ఒప్పుకున్నప్పుడు అలా చేస్తానంటూ గీతూ రాయల్ తెలిపింది. ఇప్పుడు నాకు చాలా టాలెంట్ ఉంది. నాకీ సింపతీ అవసరం లేదని వివరించింది.