Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే వారం అంటే.. నవంబర్ 15న ఈ ఏడాది మధ్యంతర ఎన్నికల ఓటింగ్ చివరి రోజు సందర్భంగా చాలా పెద్ద ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ మూడవ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీచేస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ అంగీకరించలేదు. శ్వేతసౌథం విడిచి వెళ్లేందుకు ఇష్టపడలేదు కూడా. ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు కూడా. ఆ సమయంలో ట్రంప్ కోర్టులను కూడా ఆశ్రయించారు. అక్కడ కూడా ట్రంప్‌కు చుక్కెదురయ్యింది. అతికష్టంగానే ట్రంప్ అధ్యక్ష భవనం వీడారు ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌కు వైట్ హౌస్ పగ్గాలను అందుకున్నారు.
2024 ఎన్నికల్లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తానని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఓహియోలో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి నవంబర్ 15 ఫ్లోరిడా పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగోలో చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు పంపారు.
Donald Trump : రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తారా?
మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది అమెరికా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఏడాదిలో మధ్యంతర ఎన్నికలలో ఓటింగ్ చివరి రోజు ముందు ఓహియోలో ప్రచారం చేస్తున్నప్పుడు ట్రంప్ మూడవ అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. సెనేట్ అభ్యర్థి జెడి వాన్స్‌కు మద్దతుగా ట్రంప్ మధ్యంతర సీజన్‌లో చివరి ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్ ఒహియోను 2016, 2020 రెండింటిలోనూ 8 పాయింట్ల తేడాతో గెలుపొందారు. హైపర్-కాంపిటీటివ్ సెనేట్ ప్రైమరీలో వాన్స్‌కు మద్దతు ఇవ్వాలనే ట్రంప్ నిర్ణయం రాజకీయంగా హీటెక్కించింది.
2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లు తనను మోసం చేసి గెలిచారని ట్రంప్ ఆరోపించారు. అయోవాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. 2020 ఎన్నికల సమయంలో జరిగిన మోసంతో తాను ఓడిపోయాను తెలిపారు. ఈసారి కచ్చితంగా విజయం తనదేనన్న ధీమాతో ట్రంప్ కనిపిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పోటీ చేశానని, 2016లో కంటే 2020లో ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. వచ్చే 15వ తేదీన ట్రంప్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
Read Also : Android Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..!