jabardasth: తెలుగు సినిమా ప్రమోషన్లు కొత్త పంథాలో నడుస్తున్నాయి. సినిమాను ఎంత గొప్పగా తీసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ప్రమోషన్లు మాత్రం కచ్చితంగా చేస్కుంటున్నారు. అయితే సినిమమాను ఏ రేంజ్ లో ప్రమోట్ చేశారన్నదే ప్రస్తుతం పాయింట్ గా మారింది. దర్శక నిర్మాతలు సినిమాల ప్రమోషన్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే బుల్లితెరపై జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ గురించి తెల్సుకున్న దర్శక, నిర్మాతలు అందులో తమ సినిమాలను ప్రమోట్ చేస్కునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఇందులో తమ సినిమా ప్రమోట్ చేస్కోవాలనుకుంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోందట. మరి బుల్లితెరపై జబర్దస్త్ కు ఉన్న క్రేజ్ అలాంటిది.
మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జబర్దస్త్ లో ఒక సినిమాను ప్రమోట్ చేస్కోవాలనుకుంటే దాదాపపు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తం గతంలో పాతిక లక్షల వరకు ఉండేదట. కానీ ఈ మధ్య కాలంలో జబర్దస్త్ రేటింగ్ తగ్గడం వల్ల ఈ అమోంట్ కూడా తగ్గిందని తెలుస్తోంది. క్యాష్ లో సినిమా ప్రమోషన్ కూ దాదాపు పది లక్షలు చెల్లించుకోవాలట. మొత్తానికి బ్రాండ్స్ ప్రమోషన్ ద్వారా మాత్రమే కాకుండా సినిమా ప్రమోషన్ల ద్వారా కూడా జబర్దస్త్ నిర్వాహకులు భారీగానే సంపాదిస్తున్నారు.